టైమ్‌ ట్రావల్‌ సినిమాలు వరుస కడుతున్నాయ్‌

టైమ్‌ ట్రావెల్‌ సినిమాల గురించి ఈ మధ్య వార్తలు ఎక్కువయ్యాయి. మీరు కూడా చదివే ఉంటారు. కొత్త కథలను రాయడంలో రచయితలు, వాటిని ఓకే చేసి పట్టాలెక్కించడంలో మన హీరోలు, నిర్మాతలు బిజీగా ఉన్నారు. అలా టాలీవుడ్‌లో ఇప్పుడు పెద్ద ఎత్తున టైమ్‌ ట్రావల్‌ సినిమాలు సిద్ధమవుతున్నాయి. అసలు అవేంటి, ఏం చేయబోతున్నారు, ఎవరు చేస్తున్నారో ఓసారి చూద్దామా!

* టైమ్‌ ట్రావెల్‌ సినిమాలు అంటే… ఇప్పుడు ఠక్కున గుర్తొచ్చేది ‘ప్రాజెక్ట్ కె’. నిజానికి ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ ఇదీ అని చిత్రబృందం ఎక్కడా చెప్పనప్పటికీ… అదే అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో దీపిక పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌ లాంటి స్టార్లు నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ నిర్మిస్తోంది.

* బాలకృష్ణ కెరీర్‌లో మైలురాయిలా నిలిచిన సినిమా ‘ఆదిత్య 369’. సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు బాలకృష్ణ. దీని కోసం ఆయనే స్వయంగా కథ సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఈ చిత్రంతోనే మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఇప్పించాలని చూస్తున్నారు.

* ‘టాక్సీవాలా’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌. మైత్రీ మూవీస్‌ నిర్మాణంలో ఆయన ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా కూడా టైమ్‌ ట్రావెల్‌ స్టోరీ అంటున్నారు. ఇప్పటికే ఈ కథ నాగచైతన్యకు వినిపించారని తెలుస్తోంది.

* నాగచైతన్య – విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో త్వరలో ఓ వెబ్‌ సిరీస్‌ రూపొందనుంది. ఓటీటీ కోసం రూపొందిస్తున్న ఈ సిరీస్‌లో మూడు పార్టులు ఉంటాయట. ఈ సిరీస్‌ కూడా టైమ్‌ ట్రావెల్‌ స్టోరీ అని అంటున్నారు.

* నందమూరి కల్యాణ్‌రామ్‌ ‘బింబిసార’ ట్యాగ్‌ లైన్‌ చూశారా… ‘ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌’ అని ఉంటుంది. ఆ లెక్కన ఈ సినిమా కూడా అని సమాచారం. మల్లిడి వశిష్ట్‌ దర్శకుడు కాగా, కేథరిన్‌, సంయుక్త మేనన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కల్యాణ్‌ రామ్‌ ఇందులో బింబిసారుడిగా.. మోడ్రన్‌ యువకుడిగా భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు.

* శర్వానంద్‌ హీరోగా శ్రీకార్తిక్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా టైమ్‌ ట్రావెల్‌ బేస్డ్‌ అంటున్నారు. శర్వా, తన స్నేహితులతో కలసి చిన్ననాటి రోజుల్లోకి వెళ్తాడని తెలుస్తోంది.

* టైమ్‌ ట్రావెల్‌ కథాంశంతో సూర్య – విక్రమ్‌ కె.కుమార్‌ కాంబోలో రూపొందిన చిత్రం ‘24’. ఈ సినిమాకు కూడా సీక్వెల్‌ వస్తుందని సమాచారం. ఇప్పటికే ‘24’ సీక్వెల్‌కి కథ సిద్ధం చేశారని, ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందంటున్నారు.

సో మీ అభిమాన హీరోలతో టైమ్‌ ట్రావెల్‌ చేయడానికి మీరు రెడీనా… వాళ్లయితే రెడీ అవుతున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus