Titanic: ‘టైటానిక్’ మూవీ త్రీడీలో రీ రిలీజ్ ఎప్పుడంటే..

ప్రపంచ సినీ చరిత్రలో ప్రేమకథా చిత్రాలకు ఓ ప్రత్యేకత ఉంది.. వెండితెర మీద ప్రేమలో పడ్డ హీరో హీరోయిన్లు గెలిచినా.. వారి ప్రేమకథ విషాదాంతంగా ముగిసినా కానీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టి, బ్లాక్ బస్టర్ చేసిన సంఘటనలు చాాలానే ఉన్నాయి.. వాటిలో తెలుగులో వచ్చిన ఏఎన్నార్ ‘దేవదాసు’ ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ ఫిలింగా నిలిచింది.. ఇక వరల్డ్ ఫేమస్ డైరెక్టర్, క్రియేటివ్ జీనియస్ జేమ్స్ కెమరూన్ రూపొందించిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘టైటానిక్’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..

ఓడలో నాయకా నాయికల మధ్య ప్రేమ చిగురించడం.. ఓడ ప్రమాదంలో హీరో చనిపోవడం.. ముసలి ప్రాయంలో హీరోయిన్ తన ప్రేమకథ గురించిన జ్ఞాపకాలతో ఫ్లాష్ చెప్పడం అనేది క్లుప్తంగా కథ.. ‘టైటానిక్’ ఘోర ప్రమాదానికి ప్రేమ కథ జతచేయడం.. దాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, తన విజన్‌తో అత్యద్భుతంగా తీసి.. ఏకంగా 11 ఆస్కార్ అవార్డులు గెలుచుకునేలా చేశారు జేమ్స్.. జాక్, రోజ్ పాత్రలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఓడపై ఇద్దరూ చేతులు చాపి నిలబడే షాట్ అయితే ఇప్పటికీ మర్చిపోలేం..

లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌లెట్ వారి పాత్రలకు ప్రాణం పోశారు. వారి పర్ఫ్మార్మెన్స్‌కి ఆస్కార్ వస్తుందనుకున్నారు కానీ ఉత్తమ నటిగా కేట్, ఉత్తమ సహాయనటిగా గ్లోరియా మాత్రం నామినేషన్స్ దక్కించుకున్నారు. కలెక్షన్ల పరంగా హిస్టరీ క్రియేట్ చేసింది ‘టైటానిక్’.. 1997 డిసెంబర్ 19న రిలీజ్ అయిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ 2022 కి 25 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రానుంది.ఈమధ్య కాలంలో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది.

ప్రేక్షకాదారణ పొందిన మధురమైన చిత్రాలను ప్రస్తుత టెక్నాలజీతో, సరికొత్త సాంకేతికతో థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ ఫిబ్రవరి 10న ‘టైటానిక్’ 4K వెర్షన్ అది కూడా 3D లో అలరించేందుకు సిద్ధమవుతోంది. యూటీవీ సంస్థ రిలీజ్ చేయనుంది. అయితే ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వస్తుందా, లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టోరీని బిగ్ స్క్రీన్ మీద చూడ్డానికి యూత్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus