సంచలన నిర్ణయం తీసుకున్న ‘అల వైకుంఠపురంలో’ యూనిట్…!

  • September 28, 2019 / 12:37 AM IST

టాలీవుడ్ లో దర్శకనిర్మాతలకి సెంటిమెంట్ లు బాగా ఎక్కువే…! ముహూర్తం దగ్గర్నుండీ రిలీజ్ డేట్ వరకూ గా వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతుంటారు. ఇదిలా ఉండగా… ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ చిత్రం విషయంలో కూడా ఇలాంటి సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నారట దర్శకనిర్మాతలు. విషయం ఏంటంటే.. ఈ చిత్రం టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌తో పాటు టీజర్‌ను రిలీజ్‌ చేసినప్పుడు సినిమా పేరు ఇంగ్లీష్‌లో Ala Vaikunthapuramulo అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

కానీ ఇప్పుడు ‘సామజవరగమన’ సాంగ్‌ టీజర్‌ రిలీజ్‌ సమయంలో మాత్రం టైటిల్‌లో చిన్న మార్పు చేసి Ala Vaikunthapurramuloo అని రాసుకొచ్చారు. ఇక్కడ పరిశీలిస్తే టైటిల్‌లో అదనంగా మరో ‘ఆర్‌,ఓ’ లను యాడ్ చేశారన్న మాట. నిర్మాతలు, నటీనటులు అంతా ఇదే హ్యాష్‌ ట్యాగ్‌తో టీజర్‌ను ప్రమోట్ చేస్తున్నారు. దీంతో నేమ్‌ కరెక్షన్‌లో భాగంగానే ఈ మార్పు చేశారని తెలుస్తుంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘గీతాఆర్ట్స్‌’, ‘హారికా హాసిని క్రియేషన్స్‌’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus