హరీష్ ఆ టైటిల్ ను ఫిక్స్ చేసేసాడా?

Advertisement

పదేళ్ళ పాటు సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో మంచి హిట్టిచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. అది ‘దబాంగ్’ రీమేకే కదా అని ఎంతో మంది కామెంట్స్ చేసినా.. తమిళంలో కూడా ‘దబాంగ్’ చిన్ని శింబుతో రీమేక్ చేశారు. మరి అక్కడ హిట్ అవ్వలేదు కదా అనే లాజిక్ ను అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఆ చిత్రం పవన్ కళ్యాణ్ ను ఎంతో ఎనర్జిటిక్ గా చూపించి ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ పెట్టాడు హరీష్. మళ్ళీ ఈ కాంబినేషన్లో సినిమా వస్తే బాగుణ్ణు అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు పవన్ 28 వ చిత్రాన్ని డైరెక్ట్ చెయ్యబోతున్నాడు హరీష్ శంకర్. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు హరీష్. దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నట్టు కూడా తెలిపాడు. మే 11న ‘గబ్బర్ సింగ్’ చిత్రం వచ్చి 8ఏళ్ళు పూర్తిచేసుకున్న తరుణంలో ఈ విషయాన్ని తెలియజేసాడు. ఇక ఈ చిత్రంలో కూడా పవన్ ఫ్యాన్స్ కు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం టైటిల్ ఇదేనంటూ ఫిలింనగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ‘ఇప్పుడే మొదలైంది’ అనే టైటిల్ అని అంటున్నారు. ‘గబ్బర్ సింగ్’ ఇంటర్వెల్ కూడా ఈ డైలాగ్ తోనే పడుతుంది. ఇక హరీష్ కూడా ఈ మధ్య ‘ఇప్పుడే మొదలైంది’ అంటూ ట్వీట్ చేసాడు. దాదాపు ఇదే టైటిల్ ఫిక్సయినట్టు టాక్ నడుస్తుంది.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus