‘యువకుడు’ చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది భూమిక. ఆ చిత్రం అంతగా హిట్టవ్వకపోయినప్పటికీ… అటు తరువాత వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ చిత్రం భూమికకు పెద్ద హిట్ ఇచ్చింది. ఈ చిత్రంలో తన నటనతో కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మధుమతి గా భూమిక నటన… ముఖ్యంగా ఈ చిత్రంలో నడుము సీన్ ఇప్పటికీ యూత్ ని కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్రం తరువాత మహేష్ బాబు ‘ఒక్కడు’, జూ.ఎన్టీఆర్ ‘సింహాద్రి’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోల సరసన నటించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే 2007లో భరత్ ఠాకూర్ ని వివాహం చేసుకోవడంతో… భూమికకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అయితే ఇప్పుడు భూమిక మళ్ళీ అవకాశాల కోసం ఎదురుచూస్తోందట. ఇప్పటికే ‘ఎం.సి.ఏ’ ‘సవ్యసాచి’ వంటి చిత్రాల్లో నటించిన భూమిక తిరిగి నటిగా బిజీ అవ్వాలనుకుంటుందని తెలుస్తుంది. దీనికి ముఖ్య కారణం ఆమెకి ఉన్న ఆర్ధిక ఇబ్బందులే అని తెలుస్తుంది. తన భర్త భరత్ కి వ్యాపారాల్లో తీవ్ర నష్టాలు రావడంతో భర్తకి తోడుగా ఉండడం కోసం మళ్ళీ మేకప్ వేసుకోవడానికి కారణమని తెలుస్తుంది. దీంతో చాలా మంది దర్శక నిర్మాతలు.. ఈమెకు వదిన, అక్క పత్రాలు కోసం సంప్రదిస్తున్నారట. ఇలా తన కుటుంబం కోసం భూమిక ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.