రాశీ ఖన్నా కెరీర్ ప్రారంభిన ఇండస్ట్రీకి మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అంటే సుమారు 10 ఏళ్ల తర్వాత వెళ్లింది. ఆమె నటించిన రెండో బాలీవుడ్ సినిమా విడుదలకు ఇంకా ఆపసోపాలు పడుతోంది. ఆ విషయం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. రాశీ ఖన్నా మూడో హిందీ సినిమా త్వరలో మొదలవుతోంది. తెలుగులో సరైన అవకాశాలు లేని రాశీ.. ఇప్పుడు హిందీలో స్పీడ్ చూపించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా విక్రాంత్ మాస్సే అనే యువ నటుడితోతో ఓ ప్రేమకథా చిత్రంలో నటించనున్నట్లు సమాచారం.
రోమాంటిక్ కామెడీ సినిమాగా రూపొందనున్ను ఈ చిత్రానికి బోధయాన్ రాయ్ చౌదరి దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ రెండు రోజుల క్రితం ముంబయిలో ప్రారంభమైంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయటానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. దీంతో రాశీ ఖన్నా హిందీ సినిమా కెరీర్ గురించి మళ్లీ చర్చ మొదలైంది. నిజానికి తెలుగులో అవకాశాలు తగ్గుతున్న సమయంలోనే రాశీ ఖన్నా తమిళంలోకి వెళ్లింది. అక్కడ మంచి విజయాలు వచ్చాయి. చేతిలో ఓ రెండు సినిమాలు కూడా ఉన్నాయి.
అయితే ఇప్పుడు హిందీలో ఆమె చేతిలో ఉన్న ‘యోధ’ సినిమా విడుదల కావడం లేదు. చాలా రోజులుగా ఈ సినిమా వరుస వాయిదాలు పడుతోంది. అంతా ఓకే రిలీజ్ డేట్ ఇదే అంటున్నప్పుడు ఏదో కారణంతో సినిమా వాయిదా వేసేస్తున్నారు. అది కూడా కరణ్ జోహార్ నిర్మాణంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న సినిమా. అలాంటి సినిమానే ఇలా వాయిదాలు పడుతుంటే.. కొత్త హీరోతో ఇప్పుడు రాశీ (Actress) అక్కడ నటించడం ఓకేనా అనే ప్రశ్న వస్తోంది.
అన్నట్లు తొలి హిందీ సినిమా గురించి చెప్పలేదు కదా… ‘మద్రాస్ కేఫ్’ అనే సినిమాతో 2013లో రాశీ సినిమాలకు పరిచయమైంది. ఆ తర్వాత ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాతనే మలయాళం, తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చింది.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!