Actress: తన అనారోగ్య సమస్యని బయటపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఘోరం!

హీరోయిన్లు సినిమాల్లో ఎంత అందంగా కనిపించినా.. వాళ్లకి కూడా చెప్పుకోలేని సమస్యలు చాలానే ఉంటాయి. వాటి గురించి వాళ్ళు బయట చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూనే ఉన్నారు. సమంత మయోసైటిస్ తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ‘యశోద’ సినిమా టైంలో ఆమె చాలా ఇబ్బంది పడుతూనే ప్రమోషన్లకు హాజరైంది. ‘శాకుంతలం’ షూటింగ్ టైంలో, అలాగే ఆ సినిమా రిలీజ్ టైంలో మళ్ళీ అనారోగ్యం పాలైంది.

ఇప్పుడైతే కొత్త సినిమాలకి ఒప్పుకోకుండా బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయినట్టు ఈ మధ్యే తెలియజేసింది. ఆమె సంగతి పక్కన పెడితే.. ఆమెలాగే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఓ అరుదైన అనారోగ్య సమస్యతో నరకం చూస్తుందట. ఆమె మరెవరో కాదు నందిత శ్వేత. ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.. ‘ నేను గత 4 ఏళ్లుగా ఫైబ్రోమయాల్జియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను.ఇది వెన్నెముక, కండరాలకు సంబంధించిన వ్యాధి.

ఆకస్మాత్తుగా నీరసం రావడం, మొదడు నొప్పిని గ్రహించ లేక పోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. 4 ఏళ్లుగా ఈ వ్యాధితో నరకం చూస్తున్నా.! ‘ అంటూ ఆమె (Actress) చెప్పుకొచ్చింది. మరికొద్ది రోజుల్లో ఆమె ‘హిడింబ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగానే నందిత ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. అశ్విన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం జూలై 20 న విడుదల కాబోతోంది. టీజర్, ట్రైలర్లకి మంచి రెస్పాన్స్ లభించిన సంగతి తెలిసిందే.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus