టాలీవుడ్ లో పాగా వేస్తున్న పంజాబీ గుమ్మలు

  • August 19, 2016 / 05:15 AM IST

పంజాబీ అమ్మాయిలపై తెలుగు సినీ ప్రేక్షకులు అభిమానం పెంచుకుంటున్నారు. వెండితెరపై హీరోయిన్ గా వారి నటన చూసి మనసు పారేసుకుంటున్నారు. పంజాబ్ లో పుట్టి పెరిగిన భూమిక, రకుల్ ప్రీత్ సింగ్ లకు టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థాయిని అందించారు. అందుకే మన దర్శకులు ఏరికోరి పంజాబీ అమ్మాయిలను తీసుకొస్తున్నారు. సుశాంత్ హీరోగా “ఆటాడుకుందాం.. రా” సినిమా ద్వారా మరో పంజాబీ గర్ల్ సోనమ్ బజ్వా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతోంది. ఈ సందర్బంగా టాలీవుడ్ లో అందం, అభినయం తో ఆకట్టుకుంటున్న పంజాబీ అమ్మాయిల గురించి ఫోకస్..

భూమికపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ చిత్రంలో భూమిక హీరోయిన్ గా నటించి యువకుల హృదయాలను కొల్లగొట్టింది. యువకుడు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ పంజాబీ అమ్మాయి ఒక్కడు, సింహాద్రి సినిమాలతో సూపర్ హిట్ లను అందుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ, భోజ్ పురి భాషా చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. తన మాతృభాష పంజాబీ లోను ఓ సినిమా చేసింది.

నవనీత్ కౌర్శీను వాసంతి లక్ష్మి సినిమాలో డీ గ్లామరైజ్ పాత్రలో నటించి మెప్పు పొందిన నవనీత్ కౌర్ పుట్టింది, పెరిగింది ముంబైలో అయినా తన తల్లిదండ్రులది మాత్రం పంజాబీ. అందుకే ఆమె సోయగంతో ఆకట్టుకుంది. శత్రువు, గుడ్ బాయ్ వంటి అనేక చిన్న సినిమాల్లో నటించింది. యమదొంగ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రంభ గా ఓ పాటలో నర్తించి మంచి మార్కులు కొట్టేసింది.

పూనమ్ బజ్వాహోమ్లీ పాత్రలు చేస్తూ మంచి నటిగా పేరు తెచ్చుకున్న పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా. “మొదటి సినిమా” అనే తెలుగు చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బాస్, పరుగు చిత్రాల్లో కనిపించింది. స్కిన్ షో కి దూరంగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాది భాషా చిత్రాల్లో బిజీ అయింది.

యామి గౌతమ్ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటనల ద్వారా అందరికీ పరిచయమైన మోడల్ యామి గౌతమ్. ఈమె హిమాచల్ ప్రదేశ్ బిలాసపూర్ లో జన్మించింది. అయితే ఈమె తండ్రి పంజాబీ. పెద్ద డైరక్టర్. పంజాబీ లో అనేక చిత్రాలు తీశారు. ఈమెకు కూడా తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. యామి నటించిన “నువ్విలా” చిత్రాన్ని హిట్ చేశారు. ఆ తర్వాత తెలుగులో గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలో కనిపించింది.

ఛార్మి కౌర్

పంజాబీ మిఠాయి గా ఊరించే భామ ఛార్మి కౌర్. పంజాబీ సిఖ్ బ్యాగ్రౌండ్ కలిగిన ఈ నటి “నీ తోడు కావాలి” అని చిత్రంతో పరిచయమై “మాస్, మంత్ర” వంటి హిట్ లు అందుకుంది. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోని అడుగుపెట్టి విజయాన్ని సొంతం చేసుకుంది. ఐటెం సాంగ్ ల్లో అదరగొట్టే ఛార్మి “జ్యోతి లక్ష్మి” సినిమాలో వేశ్యగా నటించి అందరి మెప్పు పొందింది.

రకుల్ ప్రీత్ సింగ్ఢిల్లీలో స్థిరపడిన పంజాబీ సింగ్ కుటుంబం నుంచి వచ్చిన నటి రకుల్ ప్రీత్ సింగ్. కిరీటం చిత్రం తో అడుగుపెట్టి, వెంకట్రాది ఎక్స్ ప్రెస్ తో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వెనుతిరగలేదు. నాన్నకు ప్రేమతో, సరైనోడు చిత్రాలతో టాప్ రేంజ్ కి చేరుకుంది. ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీల్లో నటిస్తూ బిజీగా ఉంది.

సోనమ్ బజ్వాఅచ్చమైన పదహారు అణాల పంజాబీ పిల్ల సోనమ్ బజ్వా. అక్కడే పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ మాతృ భాషలోనే వెండి తెరకు పరిచయమైంది. బెస్ట్ ఆఫ్ లక్ అనే పంజాబీ చిత్రం తో అడుగు పెట్టి పంజాబ్ 1984 సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుంది. “కప్పాల్ ” అనే తమిళ మూవీతో కోలీవుడ్ లోకి ప్రవేశించింది. అక్కడ కూడా సక్సస్ ని అందుకుంది. ఇప్పుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సుశాంత్ హీరో గా నటించిన ఆటాడుకుందాం రా చిత్రం ద్వారా టాలీవుడ్ లో పరిచయం కాబోతుంది. లక్కీ హ్యాండ్ గా పేరు తెచ్చుకున్న ఈ పంజాబీ అమ్మాయి ఈ సినిమాలోనూ తన అందంతో మత్తు ఎక్కిస్తోంది. ట్రైలర్ లో సోనమ్ ను చూసిన వారందరూ “ఆటాడుకుందాం.. రా” తో ఆమె మరిన్ని అవకాశాలను చేజిక్కించుకుంటుందని చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus