తారక్ యాక్టింగ్ స్కిల్స్ గురించి ఆ స్టార్ డైరెక్టర్ అంత గొప్పగా చెప్పారా?

  • May 22, 2023 / 07:11 AM IST

ఎన్టీఆర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రామయ్యా వస్తావయ్యా పేరుతో ఒక సినిమా తెరకెక్కగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. వాస్తవానికి హరీష్ శంకర్ మొదట వేరే కథను ఎన్టీఆర్ కోసం సిద్ధం చేయడం జరిగింది. అయితే ఆ కథ అదే సమయంలో విడుదలైన రెబల్ మూవీ కథకు దగ్గరగా ఉండటంతో రామయ్యా వస్తావయ్యా కథను తయారు చేసి సెట్స్ పైకి తీసుకెళ్లడం జరిగింది. రామయ్యా వస్తావయ్యా మూవీ ఫస్టాఫ్ బాగానే ఉనన సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఈ సినిమా ఫెయిల్యూర్ కు కారణమైంది.

ఈ సినిమాలో సమంత, శృతి హాసన్ హీరోయిన్లుగా నటించగా శృతి హాసన్ డ్రెస్సింగ్ పై కూడా నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. ఈ సినిమా ఆడియో లాంఛ్ లో హరీష్ శంకర్ చేసిన కామెంట్లను మాత్రం అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరనే సంగతి తెలిసిందే. 2004లో జూనియర్ ఎన్టీఆర్ కు మొదట కథ చెప్పానని నన్ను ఆయన ఫ్రెండ్ లా ట్రీట్ చేశారని హరీశ్ అన్నారు. ఒక డైలాగ్ చెప్పాలన్నా, ఒక డ్యాన్స్ మూమెంట్ చేయాలన్నా, ఒక పంచ్ కొట్టాలన్నా సింగిల్ టేక్ లో చేస్తాడని అద్భుతమైన మెమొరీ అని మీరు విన్నారని హరీష్ శంకర్ తెలిపారు.

అయితే నాకు అనిపించింది ఏంటంటే “మళ్లీ ఇలాంటి హీరో పుడతాడా” అని ఆయన కామెంట్లు చేశారు. హరీష్ శంకర్ చెప్పిన విధంగానే తారక్ తన నటనతో అందరినీ మెప్పిస్తున్నారు. ఈతరం గొప్ప నటులలో ఒకరిగా తారక్ ఉన్నారు. సినిమా సినిమాకు అంతకంతకూ ఎదుగుతూ కెరీర్ పరంగా తారక్ సంచలన విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

విభిన్నమైన కథలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన రాబోయే రోజుల్లో ప్రేక్షకులను మరింత మెప్పించడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus