పాన్ ఇండియా సినిమాలు, ఒకటో రెండో నార్మల్ మూవీస్.. తప్ప టాలీవుడ్‌కి సరైన విజయం అందించిన సినిమా ఇటీవల కాలంలో టాలీవుడ్ నుండి రాలేదని చెప్పాలి. సినిమాలు వస్తున్నా, సరైన కంటెంట్ లేక చతికిలపడుతున్నాయి. దీంతో ఆగస్టు నెలలో అయినా సరైన విజయం దక్కుతుందా? టాలీవుడ్‌లో మళ్లీ విజయాల ఊపు కనిపిస్తుందా అని అనుకున్నారంతా. ‘బింబిసార’, ‘సీతారామం’ సినిమాలతో టాలీవుడ్ విజయాల ఊపు చూసింది. అయితే ఇప్పుడు దీన్ని మిగిలిన సినిమా కొనసాగించాలి.
ఆగస్టు మామూలుగా అయితే టాలీవుడ్‌కి అన్‌సీజన్. అందుకే ఈ టైమ్‌లో సినిమాలు అంటే పెద్దగా ఆసక్తి చూపించరు మన సినిమావాళ్లు. అయితే పరిస్థితులు మారడంతో… సినిమాలు ఈ నెలలో ఎక్కువగానే వస్తున్నాయి. దీంతో టాలీవుడ్ మళ్లీ విన్నింగ్ స్ట్రీక్ మొదలైతే బాగుండు అని అందరూ అనుకున్నారు. ఈ వారం విడుదలైన ‘బింబిసార’, ‘సీతా రామం’ విజయాలు దక్కించుకున్నాక ఇప్పుడు టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. ఒకే రోజు విడుదలైన రెండు సినిమాలు విజయాలు అందుకోవడం చాలా పెద్ద విషయమే అని ఇండస్ట్రీ ఆనందపడుతోంది.
అయితే, ఇక్కడే ఓ విషయం ఇండస్ట్రీ గుర్తుంచుకోవాలి. సినిమా టికెట్ రేట్లు తగ్గించడం, కథలో పట్టు ఉండటం, సరైన సినిమా అవ్వడంతో ప్రేక్షకులు ఇల్లు వదిలి థియేటర్లకు వస్తున్నారు. ఈ సమయంలో దర్శకనిర్మాతలు తిరిగి బ్యాక్ టు పెవిలియన్ అవ్వకుండా ఉంటే చాలు. గతంలో ఇలాగే తక్కువ ధరలకు సినిమాలకు జనాలు వస్తుండేవారు. అప్పుడే ధరలు పెంచి థియేటర్లకు జనాలను దూరం చేశారు. మరోవైపు సరైన కథాంశం లేని కథలతో సినిమాలు చేసి ఇబ్బంది పడ్డారు.
దీంతో పాన్ ఇండియా సినిమాలిచ్చిన విన్నింగ్ స్ట్రీక్ మిస్ అయ్యింది. రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’, నిఖిల్ ‘కార్తికేయ 2’ సినిమాలు రెండో వారంలో వస్తాయి. ఆఖరి వారంలో ‘లైగర్’ వచ్చేస్తోంది. దీంతో గెలుపు బాటను ఈ సినిమాలు కంటిన్యూ చేయాలి. లేదంటే మళ్లీ ఇబ్బందులు తప్పవు. చూద్దాం టాలీవుడ్ జనాలు ఏం చేస్తారో మరి.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?