Tollywood: భారీగా పారితోషికం పెంచేసిన సాయితేజ్, రామ్, నిఖిల్.. ఎంతంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకునే హీరోల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. కొంతమంది హీరోలు తమ సినిమాల థియేట్రికల్ హక్కులతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. కొంతమంది హీరోలు సక్సెస్ లో ఉండటం వల్ల రెమ్యునరేషన్ ను పెంచుకుంటుండగా మరి కొందరు హీరోలు మాత్రం ఫ్లాపుల్లోఉన్నా పారితోషికంను పెంచుతున్నారు. నాని, రవితేజ పారితోషికాలు ప్రస్తుతం 20 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా సాయితేజ్, రామ్, నిఖిల్, వరుణ్ తేజ్ పారితోషికాలు 10 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు పరిస్థితులు ఆశాజనకంగా లేవు. మెజారిటీ సినిమాలు నిర్మాతలకు నష్టాలను మిగుల్చుతున్నాయి. నిర్మాతకు నష్టం వస్తే ఆదుకోవడానికి కొంతమంది హీరోలు సుముఖంగానే ఉండగా మరి కొందరు హీరోలు మాత్రం సుముఖంగా లేరు. ఈ విధంగా చేయడం వల్ల భవిష్యత్తులో సినిమాలను నిర్మించే నిర్మాతల సంఖ్య సైతం పెరుగుతోంది.

హీరోలు పారితోషికాలను తగ్గించుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్ల విషయంలో హీరోలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. టాలీవుడ్ హీరోలు రెమ్యునరేషన్లకు బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల ఇండస్ట్రీలో నిర్మాతల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

టాలీవుడ్ (Tollywood) హీరోలు ఈ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పవచ్చు. మరి టాలీవుడ్ హీరోల కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. టాలీవుడ్ హీరోలు కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు ఇతర భాషల్లో కూడా సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. టాలీవుడ్ హీరోలు ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus