కృష్ణతో పాటు అల్లూరి పాత్రలో కనిపించిన టాలీవుడ్ హీరోలు..!

  • July 5, 2022 / 09:33 AM IST

స్వాతంత్ర సమరయోధుడు, విప్లవ వీరుడు, మన్యం వీరుడు గా పిలువబడే అల్లూరి సీతారామ రాజు 125 వ జయంతి నేడు. ఆయన గురించి కథలు కథలుగా విన్నాం.. సినిమాల ద్వారా ఆయన గొప్పతనం తెలుసుకున్నాం, ఆయన వీరత్వం చూశాం. తెలుగులో అల్లూరి సీతారామరాజు గా నటించడానికి చాలా మంది హీరోలు రెడీగా ఉన్నారు. కానీ ఆ అదృష్టం కొంతమందికే దక్కింది. ఆ హీరోలు ఎవరో అందరికీ తెలిసిందే :

1) కృష్ణ :

అల్లూరి సీతారామరాజు అనే పేరు వినబడితే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు కృష్ణ. వి.రామచంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ మూవీకి త్రిపురనేని మహారథి కథ అందించారు. కృష్ణ సోదరుడు జి.హనుమంతరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1974 వ సంవత్సరం మే 1న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మిగిలింది.

2) నందమూరి తారక రామారావు :

అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించాలని సీనియర్ ఎన్టీఆర్ పరితపించారు. కానీ కథ వర్కౌట్ కాలేదు. ఆయన చేద్దాం అని ఆలోచనలో ఉన్నప్పుడే సూపర్ స్టార్ కృష్ణ ఆ ప్రాజెక్టు ని చేయడం బ్లాక్ బస్టర్ అందుకోవడం జరిగిపోయింది. అయినా ఆ పాత్రలో నటించాలి అనే ఆశ ఎన్టీఆర్ లో బలంగా ఉండటం వలన కె.రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలో కాసేపు అల్లూరి లా కనిపించి ఆయన ముచ్చట తీర్చుకున్నారు.

3) బాలకృష్ణ :

అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించాలని బాలకృష్ణ కూడా ఆశపడ్డారు. ‘భారతంలో బాల చంద్రుడు’ చిత్రంలో అల్లూరి గా కనిపించి ఆయన ముచ్చట తీర్చుకున్నారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో కూడా ఓ సీన్ లో అల్లూరి గెటప్ వేసి కనిపించారు బాలయ్య.

4) రాంచరణ్ :

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చాలా బాగా నటించాడు చరణ్. అల్లూరి ని ఉక్కు మనిషి అని కొందరు అంటుంటారు. ఈ చిత్రంలో చరణ్ కూడా అలానే కనిపించి కృష్ణ గారి తర్వాత ఆ పాత్రకి జీవం పోసిన హీరోగా నిలిచారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus