న్యూఇయర్ హంగామాలో హీరోయిన్ల ఇమేజ్ లకు డ్యామేజ్

ఈమధ్యకాలంలో కొందరు హీరోయిన్స్ సినిమాల్లో సంపాదించేదానికంటే ఎక్కువగా ఈవెంట్స్ కి గెస్ట్ లుగా వెళ్ళడం ద్వారా సంపాదిస్తున్నారు. ఇక స్పెషల్ ఈవెంట్స్ లో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ లు ఇస్తే ఆ వచ్చే ఎమౌంట్ డబుల్ అవుతుంది. అందుకే షూటింగ్స్ కు కూడా బ్రేక్ చెప్పి మరీ ఈవెంట్స్ కి వెళ్తుంటారు. అయితే.. డ్యాన్స్ చేసి ఆహుతులను ఆనందపరిచి ఆ వెన్యూ నుంచి సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లిపోతే ఆ హీరోయిన్ కంటే సంతోషపడే వ్యక్తి ఈ ప్రపంచంలో మరొకరు ఉండరు. ఎందుకంటే.. ఎందరు బౌన్సర్స్, సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఈ తరహా ఈవెంట్స్ లో హీరోయిన్స్ ను తాకడానికి ఎవరో ఒకరు ప్రయత్నిస్తూనే ఉంటారు. పబ్లిక్ ఈవెంట్స్ లోనే హీరోయిన్స్ ను వదిలిపెట్టరు కొందరు కుర్రకారు.

అలాంటిది తప్ప తాగి చిందులేసే న్యూఇయర్ ఈవెంట్స్ లో హీరోయిన్ వాళ్ళకి దొరికితే పరిస్థితి ఏమిటనేది ప్రత్యేకించి చెప్పాలా. మొన్న రాత్రి జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్స్ లో ఈ తరహా సంఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. ఇద్దరూ చిన్న హీరోయిన్సే. ఒకామె స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ అయిపోయి వెళ్లిపోతుండగా టాప్ ఉడిపోయింది. లక్కీ గ్రూప్ డ్యాన్సర్స్ ఆమెను కవర్ చేశారు. అప్పటికే చూడాల్సిన వాళ్ళందరూ ఆమె అందాలను చూసేశారు. ఇంకో ఈవెంట్ లో మరో హీరోయిన్ డ్రెస్ ఛేంజ్ చేసుకుంటుండగా.. కొందరు తాగి వచ్చి ఆమె మీదపడి ముద్దుల వర్షం కురిపించడమే కాక తాకరాని చోట తాకి చాలా ఇబ్బంది కలిగించారట. లక్కీ ఈ వ్యవహారాలు ఏ ముబైల్ ఫోన్ లోనూ చిక్కలేదు. దాంతో ఊపిరి పీల్చుకున్నారు ఈ ముద్దుగుమ్మలు. అయినా ఈ తరహా ఈవెంట్స్ కి వెళ్ళేప్పుడు రెమ్యూనరేషన్ మాత్రమే కాదు సెక్యూరిటీ కూడా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus