తెలుగులో ఆఖరి సూపర్ హిట్ ఏంటో తెలుసా?

  • December 9, 2017 / 06:13 AM IST

సినిమా విడుదలైన రోజే టైటిల్ కి తగ్గట్లు ఏవేవో ట్యాగ్ లైన్లు పెట్టి “సూపర్ హిట్, డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్” అంటూ పోస్టర్లు రిలీజ్ చేయడంతోపాటు టీవీల్లోనూ అవే తరహాతో ప్రోమోలు ప్లే చేయడంతో.. ఏ సినిమా హిట్, ఏ సినిమా ఫట్. అసలు కమర్షియల్ గా ఏ సినిమా విజయం సాధించింది. ఏ సినిమాకి మంచి పేరు వచ్చినా సరైన లాభాలు కాదు కదా కనీసం పెట్టిన ఖర్చులు సైతం రాబట్టుకోలేక పరాజయం పాలైంది అనే విషయాలపై ప్రేక్షకుడికి క్లారిటీ లేక రివ్యూల మీద ఆధారపడి ఒక అయిదారు వెబ్ సైట్లు బాగుంది అని చెప్పిన సినిమాకి మాత్రమే వెళుతున్నాడు. ఇది ప్రేక్షకుల సమస్య మాత్రమే కాదు ఇండస్ట్రీ వ్యక్తులకు కూడా ఏది నిజమైన విజయం, ఏది సోషల్ మీడియా హిట్ అనే విషయంలో క్లారిటీ లోపిస్తుంది.

అయితే.. ఒక సినిమా ఫైనల్ గా హిట్ అనిపించుకొనేది వచ్చిన కలెక్షన్స్ బట్టి. ఆ విధంగా కలెక్షన్స్ పరంగా మంచి హిట్ అందుకొన్న రీసెంట్ సినిమా సిద్ధార్ధ్ “గృహం”. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం తొలుత తమిళంలో, తర్వాత హిందీలో విడుదలై మంచి టాక్ దక్కించుకొన్నాక తెలుగులో మాత్రం థియేటర్ల లభ్యత విషయంలో తీర్వ్రమైన సమస్యలు ఎదుర్కొని ఎట్టకేలకు విడుదలైంది. తెలుగులో వచ్చిన మొట్టమొదటి ప్యూర్ హారర్ సినిమా కావడంతోపాటు.. సినిమాపై విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపించడంతో స్లోగానైనా సూపర్ హిట్ అయ్యింది. ఓవరాల్ గా సినిమా 12 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఈమధ్యకాలంలో ఒక మీడియం బడ్జెట్ సినిమా ఆ స్థాయిలో వసూలు చేయడం అనేది సాధారణ విషయం కాదు. రాజశేఖర్ కమ్ బ్యాక్ ఫిలిమ్ “గరుడ వేగ” కూడా మంచి లాభాలు తెచ్చినప్పటికీ.. పెట్టుబడితో కంపేర్ చేసుకొంటే.. “గృహం” పెద్ద విజయం అని చెప్పుకోవచ్చు.

ఇక డిసెంబర్ 21న విడుదలవుతున్న నాని “ఎం.సి.ఏ”, అఖిల్ “హెల్లో” చిత్రాలు గనుక ఏమైనా వండర్స్ సృష్టించగలిగితే ఈ లిస్ట్ లో మార్పు వస్తుంది. లేదంటే.. 2017లో లాస్ట్ హిట్ గా “గృహం” మిగిలిపోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus