మరో బెస్ట్‌ సీజన్‌ను వదిలేస్తున్న టాలీవుడ్‌… మన నిర్మాతలు ఇవి గమనిస్తున్నారా?

  • July 20, 2024 / 05:10 PM IST

టాలీవుడ్‌కి పండగ సీజన్‌ అంటే సినిమాల సీజన్‌ అనే. ఏదైనా పండగ వస్తోంది అంటే మంచి సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు రెండు, మూడు సినిమాల అయినా ఆ సీజన్‌ను బాగా వాడేసుకునేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. పెద్ద సినిమాలుఉ ఎప్పుడు పూర్తయి, విడుదలైతే అప్పుడే సీజన్‌ అంటున్నారు. ఈ క్రమంలో పండగ సీజన్ల బోసిపోతున్నాయి. పెద్ద సినిమాలు రాకపోవడంతో చిన్న సినిమాలు, డబ్బింగ్‌ సినిమాలే దిక్కవుతున్నాయి. అలా ఈ ఏడాది దసరా కూడా మారబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

కావాలంటే మీరే చూడండి అక్టోబరులో వస్తాయి అనుకుంటున్న కొన్ని సినిమాలు ముందు నెలకు వచ్చేస్తుంటే, మరికొన్ని తర్వాత నెలలకు వెళ్లిపోతున్నాయి. ముందుకొస్తున్న సినిమా ‘దేవర’ (Devara) అయితే.. వెనక్కి వెళ్తున్నవి త్వరలో తేలుతుంది. దీంతో అక్టోబరులో తెలుగు సినిమాలు సరైనవి రావడం లేదు. ముఖ్యంగా అక్టోబరు రెండో వారం ఖాళీగా ఉండిపోతోంది. వచ్చినప్పుడు ఇబ్బడిముబ్బడిగా వచ్చేసి, లేనప్పుడు ఇలా వదిలేయడం సరికాదు అనే చర్చ కూడా సాగుతోంది.

దీంతో ఈ దసరా డబ్బింగ్ సినిమాలకు, చిన్న సినిమాలకు అడ్డాగా మారబోతోంది అనిపిస్తోంది. సూర్య (Suriya) ‘కంగువ’ (Kanguva) ఇప్పటికే దసరాకు వస్తుంది అని ప్రకటించేశారు. రజనీకాంత్ (Rajinikanth) ‘వేట్టయాన్’ (Vettaiyan) రావడం దాదాపు ఆ రోజే అంటున్నారు. పెద్ద క్లాష్ అయినప్పటికీ ఫెస్టివల్ రోజులు కాబట్టి ఓకే అనుకుని నిర్మాణ సంస్థలు ఓకే అంటున్నాటయ. దీంతో తమిళ హీరోలే మనకు దసరా శుభాకాంక్షలు చెబుతారు అని ఓ అంచనాకు వస్తున్నారు నెటిజన్లు.

ఎందుకంటే తెలుగు సినిమా వైపు నుండి ఇప్పటిదాకా ఏ పెద్ద సినిమా అక్టోబర్ 10వ తేదీని లాక్ చేసుకోలేదు. దసరా అంటే ‘దేవర’ వచ్చి (వస్తే) రెండు వారాల రన్ అయిపోతుంది. అయితే తెలుగు సినిమాలు లేకపోవడం వల్ల ఆ సినిమానే ఇంకా థియేటర్లలో ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన దసరా సరదా టాలీవుడ్‌కి ఉండదు అని చెప్పేయొచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus