త్రివిక్రమ్ పరిచయం చేసిన హీరోయిన్.. చిన్నప్పటి ఫోటో వైరల్..!

  • February 15, 2021 / 06:41 PM IST

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు తమ చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం మనం చూస్తూనే వస్తున్నాం. గతేడాది కరోనా లాక్ డౌన్ టైం నుండీ ఈ ట్రెండ్ మొదలైంది. అప్పటి నుండీ స్టార్ హీరోయిన్లు కూడా వారి చైల్డ్ హుడ్ పిక్స్ ను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇలా వారు పోస్ట్ చెయ్యగానే అవి వెంటనే వైరల్ అయిపోతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. ఈ నేపథ్యంలో తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా తన చైల్డ్ హుడ్ పిక్ ను షేర్ చేసింది.

ఎవరామె అనుకుంటున్నారా? ఈ మలయాళం హీరోయిన్ త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.ఆ చిత్రంలో ఈమె సెకండ్ హీరోయిన్. ఈ పాటికే కనిపెట్టేసి ఉంటారు కదా..! యెస్.. అనుపమ పరమేశ్వరనే…! చిన్నప్పుడు తన బామ్మగారితో తీసుకున్న ఫోటోని ఇటీవల తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనుపమ. ఈ ఫొటోలో ఎంతో చక్కగా నిలబడి క్యూట్ స్మైల్ ఇస్తుంది ఈ చేప కళ్ళ సుందరి.

ఈ ఫోటోని చూసిన ఆమె అభిమానులు లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. ‘రాక్షసుడు’ చిత్రం తరువాత తెలుగులో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు అనుపమ పరమేశ్వరన్. అయితే ఇటీవల మాత్రం ఓటీటీ ఎంట్రీ ఇచ్చి బోల్డ్ లుక్ తో షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం‌ తమిళ, మలయళ భాషల్లో ఒక్కో సినిమా చేస్తున్న అనుపమ… టాలీవుడ్‌ లో నిఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటించబోతున్నట్టు సమాచారం.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus