Animal Movie: ఎనిమల్ చిత్రాన్ని ఆ హీరో గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యాడుగా!

  • June 14, 2023 / 03:07 PM IST

అర్జున్ రెడ్డి మరియు కబీర్ సింగ్ వంటి సంచలనాత్మక చిత్రాల తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తీస్తున్న చిత్రం ‘ఎనిమల్’. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరో గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 11 వ తారీఖున విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ టీజర్ ని నిన్న విడుదల చేసారు. మెయిన్ టీజర్ ని మరో రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. నిన్న విడుదల చేసిన ప్రీ టీజర్ కి మంచి స్పందన వచ్చింది.

ఇందులో రణబీర్ కపూర్ ని మోస్ట్ వైలెంట్ గా చూపించబోతున్నాడు సందీప్. (Animal Movie) ఈ చిత్రం లో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుంది. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో సూపర్ హిట్ ని అందుకొని తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన రణబీర్ కపూర్ ఇప్పుడు ‘ఎనిమల్’ చిత్రం తో మరోసారి తెలుగు ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు.తెలుగు తో పాటుగా తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతుంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యింది, అది ఏమిటంటే ఈ సినిమాని తొలుత సందీప్ రెడ్డి సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యాలి అనుకున్నాడట. కానీ మహేష్ బాబు ఈ చిత్రం లో వైలెన్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడం తో సినిమా చెయ్యడానికి ఒప్పుకోలేదట. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత మొట్టమొదట సందీప్ రెడ్డి వంగ కలిసింది సూపర్ స్టార్ మహేష్ బాబు ని మాత్రమే.

ఆయన తో సినిమా చెయ్యాలి అనేది సందీప్ రెడ్డి వంగ కోరిక,ఫ్యాన్స్ కూడా ఈ కాంబినేషన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక నిన్న విడుదలైన ప్రీ టీజర్ ని చూసిన తర్వాత అయ్యో ఎలాంటి సినిమా మిస్ అయ్యాం అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు.ఇక ఈ సినిమా కాకపోయినా భవిష్యతులో అయినా మహేష్ బాబు తో చేస్తే చాలు అని కోరుకుంటున్నారు.ఎనిమల్ చిత్రాన్ని వదులుకున్న తెలుగు స్టార్ హీరో అతనేనా?

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus