అందం, అభినయం మరియు డ్యాన్స్, నటన ఈ నాలుగు ఉన్న హీరోయిన్లు మన సౌత్ లో దొరకడం చాలా కష్టం. చాలా తక్కువ మందికి మాత్రమే ఇలాంటివి ఉంటాయి. అలాంటి వారిలో ఒకరు శ్రీయా శరన్. ‘ఇష్టం’ అనే చిత్రం తో హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శ్రియా, ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా కూడా ఆమెకి అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. అప్పట్లో ఈమె స్టార్ హీరోల పాలిట గోల్డెన్ లెగ్. శ్రీయా ఉంటే ఆ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్ అందరిలో ఉండేది.
అంతే కాదు టాలీవుడ్ లో మూడు జనరేషన్ హీరోలను కవర్ చేసిన ఏకైక స్టార్ హీరోయిన్ గా శ్రీయా కి అరుదైన రికార్డు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, కోలీవుడ్ మరియు మాలీవుడ్ లో కూడా ఆమె అదే స్థాయిని దక్కించుకుంది. సాధారణంగా హీరోయిన్స్ కెరీర్ మొత్తం కాంట్రవర్సీలు మరియు అఫైర్స్ తో నిండిపోయి ఉంటుంది. నిజమైన కాకపోయినా కూడా హీరోయిన్ కెరీర్ లో ఎదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది.
కానీ శ్రీయా కి మాత్రం అలాంటి పరిస్థితి రాలేదు. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఆమె పై ఒక్కటంటే ఒక్క రూమర్ కూడా వినిపించలేదు. కానీ అప్పట్లో ఈమెని ఒక టాలీవుడ్ స్టార్ హీరో తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా ప్రపోజల్ పెట్టాడట. శ్రీయా ఆ ప్రపోజల్ కి ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటికే ఆ స్టార్ హీరోకి పెళ్లి జరిగింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
తన ప్రపోజల్ రిజెక్ట్ చేసింది అనే అహంకారం తో ఆ స్టార్ హీరో (Shriya Saran) శ్రియా కి టాలీవుడ్ లో అవకాశాలు రానివ్వకుండా చేసేసాడు. శివాజీ చిత్రం తో సౌత్ ని షేక్ చేసిన శ్రీయా, అకస్మాత్తుగా టాలీవుడ్ లో మాయం అయిపోయింది ఎందుకు అంటే, దానికి కారణం ఇదేనట. అలా శ్రీయా కెరీర్ డౌన్ అవ్వడం, ఇప్పుడు ఆమె క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ వెయ్యడం మనమంతా చూస్తూనే ఉన్నాం.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!