యాంగ్రీ యంగ్ మ్యాన్ నుంచి యాంగ్రీ యాక్టర్‌గా మారిపోయారు రాజశేఖర్. అయితే ఒక్క విషయంలో మాత్రం అయనను మారుద్దాం అంటే ఆయన ముందుకు రావడం లేదు. అదే నాన్ హీరో రోల్స్. ఇండస్ట్రీలో సీనియర్ నటులు వెర్సటైల్ పాత్రలు చేయడానికి ముందుకొస్తూ తమ నటనా వైవిధ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలు అవకాశాలు తగ్గడమో, మంచి పాత్రలు రావడం ఇలా చాలా కారణాలే ఉన్నా.. నటులను అలా చూస్తున్నాం. కానీ రాజశేఖర్ మాత్రం ఇలాంటి పాత్రలకు చాలా కాలంగా దూరంగానే ఉన్నారు.
రాజశేఖర్‌ను చాలామంది దర్శకులు వైవిధ్య పాత్రలవైపు, నాన్ హీరో పాత్రలవైపు తీసుకెళ్లే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. చాలా ప్రయత్నాలు చేశాక కూడా ఆయన ఓకే చేయలేదు. అయితే ఈ విషయంలో వక్కంతం వంశీ విజయం సాధించారు అని చెప్పాలి. ‘అదేంటి నాన్ హీరో పాత్రకు రాజశేఖర్ ఓకే చెప్పేశారా?’ అని అనుకుంటున్నారా? అవును ఆయన ఓకే ఏశారు. అంతేకాదు సెట్స్‌లో అడుగుపెట్టారు కూడా. నితిన్ ‘ఎక్స్‌ట్రా’ సినిమా కోసం రాజశేఖర్ నటిస్తున్నారు. రాజశేఖర్ సినిమాల్లో చేయని జోనర్ లేదు.
యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, డ్రామా ఇలా చాలా రకాల జోనర్లలో సినిమాలు చేశారు. ఆవేశంతో కూడిన పాత్రను పోషించడంలో ఆయన్ను కొట్టేవారే లేరు. అందుకే యాంగ్రీ యంగ్ మ్యాన్ అయ్యారు. ఇప్పుడు యాంగ్రీ యాక్టర్ కూడా అయ్యారు. ‘పీఎస్‌వీ గరుడ వేగ’ సినిమా తరవాత రాజశేఖర్ మరో సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. దీంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోతే బాగుండు అనే వాదనలు వినిపిస్తూ వచ్చాయి. కానీ ఆయన నో చెబుతూనే వచ్చారని టాక్. అయితే, నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎక్స్‌ట్రా – ఆర్డనరీ మేన్’ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
రెండు రోజుల క్రితం సెట్‌లో అడుగుపెట్టి షూటింగ్ చేశారట. రాజశేఖర్ కోసం వక్కంతం వంశీ డిజైన్ చేసిన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని, అందుకే ఒప్పుకున్నారని చెబుతునక్నారు. దీంతో రాజేంద్ర ప్రసాద్, అర్జున్, సుమన్, జగపతిబాబు తర్వాత ఓ సీనియర్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ తీసుకున్నారు అని చెప్పొచ్చు. మరి రాజశేఖర్ ఆ పాత్రను ఎలా చేశారో తెలియాంటే డిసెంబరు 8 వరకు ఆగాల్సిందే. ఆ రోజే మన ‘ఎక్స్‌ట్రా’ ఆర్టినరీ మ్యాన్ (Extraordinary Man) థియేటర్లలోకి వస్తాడు.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు