అఖిల్, వెంకీ అట్లూరి మూవీలో గెస్ట్ రోల్ పోషిస్తున్న టాలీవుడ్ యువరాణి!

తొలిప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం లండన్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్ లో అఖిల్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్, ప్రధాన పాత్రదారులు పాల్గొంటున్నారు. అఖిల్ ప్లే భాయ్ గా కనిపించనున్న ఈ చిత్రానికి నాగార్జున హిట్ మూవీ మజ్ను అనే పేరుని ఫిక్స్ చేసినట్లు కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఈ చిత్రంలో టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ కీలకరోల్ పోషించనున్నట్లు ఫిలిం నగరవాసులు చెప్పారు.

కాసేపు కనిపించే పాత్ర అయినప్పటికీ కీలక రోల్ కాబట్టి కాజల్ ఒప్పుకున్నట్టు తెలిసింది. ఆమె నటించే సన్నివేశాలను త్వరలోనే తెరకెక్కించనున్నట్లు సమాచారం. బీవీఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి  ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అఖిల్ గత రెండు చిత్రాలు కమర్షియల్ విజయాన్ని అందుకోలేక పోయాయి. ఈ సినిమాతో ఆలోటుని తీర్చాలని అఖిల్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. యువతకి కనెక్ట్ అయ్యే అంశంతో  తెరకెక్కుతోన్న ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus