ఆ కేసులో టాలీవుడ్ నిర్మాత ని అరెస్టు చేసిన పోలీసులు.!

ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బు కోసం ఎన్నో రకాల తప్పుడు పనులు చేస్తున్నారు. ఎదుటి వారిని బురిడీ కొట్టించి కోట్లు దండుకుంటున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు కేటుగాళ్ళ ఉచ్చులో పడిపోయి డబ్బు పోగొట్టుకుంటున్నారు. డబ్బు మనిషిని ఏ పనైనా చేయిస్తుందని అంటారు. నేటి సమాజంలో కొంతమంది ఈజీ మనీ కోసం అక్రమాలకు పాల్పపడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతుంటారు. ఇటీవల కాలంలో అధిక వడ్డీ ఆశ చూపించి కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ళు ఎక్కువ అయ్యారు.

సినీ రంగానికి చెందిన కొంతమంది వ్యక్తులు వ్యాపార రంగంలోకి దిగి అడ్డదారిలో డబ్బు సంపాదించాలని మోసాలకు పాల్పడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత ను పోలీసులు అరెస్ట్ చేసి టాలీవుడ్ కి షాక్ ఇచ్చింది. అసలు ఏమి జరిగిదో తెలుసుకుందాం. నిర్మాత అట్లూరి నారాయణరావు‌ని ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ దందా కేసులో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆయనను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి, హైదరాబాద్ నాంపల్లి కోర్టులు హాజరు పరిచారు.

నారాయణరావుపై (Atluri Narayana Rao) గతంలో చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్, డీలర్ షిప్ పేరతో దాదాపు వందల మందిని మోసం చేసి రూ.530 కోట్లు వసూళ్లు చేశారని ఆభియోగం ఆయనపై ఉంది. ఈ కేసులో ప్రధాన సూత్రదారి గూదే రాంబాబు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కృష్ణం రాజును గత నెలలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే ఓ చార్టెట్ అకౌంట్ ద్వారా నిర్మాత నారాయణరావును కలవగా, కేసు లేకుండా చేస్తాను.. అందుకోసం ఖర్చు అవుతుందని చెప్పి రూ.20 కోట్లు డిమాండ్ చేశాడు.

బేరసారాలు చేసి డీల్ రూ.2 కోట్లకు కుదుర్చుకొని పది లక్షలు అడ్వాన్స్, కోటి విలువైన గోల్డ్ ఆభరణాలు తీసుకున్నాడు. ఆభరణాలను పాతబస్తీలో కరిగించి రూ.90 లక్షలకు అమ్మేశాడు. ఈ క్రమంలోనే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బు కోసం వెంపర్లాడే ఇలాంటి వారి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈయన నీదీ నాది ఒకే కథ, గర్ల్ ఫ్రెండు లాంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus