Missing Movie: ‘మిస్సింగ్’ మూవీని రిలీజ్ చేస్తున్న టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు..!

  • November 16, 2021 / 06:17 PM IST

హర్షా నర్రా హీరోగా నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మిస్సింగ్’. ‘బజరంగబలి క్రియేషన్స్’ పతాకం పై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 19న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కాబోతుంది ‘మిస్సింగ్’ చిత్రం. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన చిత్రమిది.

ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్ కు ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభించింది. దాంతో సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయని చెప్పొచ్చు. అంతా కొత్త వాళ్ళతో తెరకెక్కిన ఈ చిత్రం ఆంధ్ర హక్కులని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన ‘గీతా ఆర్ట్స్’ దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది ఆ సంస్థ. అలాగే తెలంగాణలో ప్రఖ్యాత ఏషియన్ సంస్థ రిలీజ్ చేస్తుంది.

ఈ మధ్యనే వీరు ‘లవ్ స్టోరీ’ తో సూపర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు బడా సంస్థలు ‘మిస్సింగ్’ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రావడంతో ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగింది. సినిమా కూడా వారి అంచనాలకు తగ్గకుండా ఉంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!


ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus