Rajamouli: జక్కన్న హీరోల బిజినెస్ ప్లాన్.. అసలు లాజిక్ ఇదే!

సాధారణంగా రాజమౌళితో సినిమా అంటే ఆ హీరో జాతకం మారిపోతుంది. మార్కెట్ పరిధి పాన్ ఇండియా స్థాయికి విస్తరిస్తుంది. మరి అలా అమాంతం పెరిగిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి మన హీరోలు ఏం చేస్తున్నారు? సరిగ్గా గమనిస్తే స్టార్ హీరోలందరిలో ఒక ఇంట్రెస్టింగ్ కామన్ పాయింట్ కనిపిస్తుంది. జక్కన్నతో పని చేశాక, అందరూ తమ సొంత బ్యానర్ల వైపే చూస్తున్నారు. ఇది యాదృశ్చికంగా జరుగుతున్నది కాదు, పక్కా బిజినెస్ ప్లాన్.

Rajamouli

ఉదాహరణకు ప్రభాస్ ను తీసుకుంటే, బాహుబలి తర్వాత వచ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ రెండూ ఆయన హోమ్ బ్యానర్ యువీ క్రియేషన్స్ లో వచ్చినవే. రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత ‘ఆచార్య’ కోసం తన సొంత సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ లోనే నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ‘దేవర’ సినిమాను తన అన్న కళ్యాణ్ రామ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే చేశారు. అంటే బయట నిర్మాతలకు డేట్స్ ఇవ్వడం కంటే, సొంత ఇంటికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

దీని వెనుక బలమైన కారణమే ఉంది. రాజమౌళి సినిమా తర్వాత హీరో మార్కెట్ పీక్స్ లో ఉంటుంది. ఆ టైమ్ లో వచ్చే సినిమాకు బిజినెస్, ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతాయి. ఆ లాభాలన్నీ వేరే నిర్మాతకు వెళ్లడం కంటే, సొంత నిర్మాణ సంస్థ ద్వారా తమకే దక్కాలనేది హీరోల ఆలోచన. అందుకే రెమ్యూనరేషన్ కంటే, లాభాల్లో వాటా వచ్చేలా సొంత బ్యానర్స్ లో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ తర్వాత మహేష్ కూడా ఇదే దారిలో వెళ్లే ఛాన్స్ గట్టిగా ఉంది. జీఎంబీ (GMB) ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే ఆయన నెక్స్ట్ సినిమా ఉండే అవకాశం ఉంది. ఆ పెరిగిన గ్లోబల్ మార్కెట్ ని పూర్తిగా వాడుకోవాలనేది సూపర్ స్టార్ ప్లాన్. అయితే ఇక్కడో చిన్న భయం కూడా ఉంది. రాజమౌళి సినిమా తర్వాత వచ్చే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరుస్తాయనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో బలంగా ఉంది. సాహో, ఆచార్య ఫలితాలు ఇందుకు ఉదాహరణ. మరి లాభమైనా, నష్టమైనా సొంత ఇంటికే చెందాలనే ఈ స్ట్రాటజీలో మహేష్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus