టైటిల్ అనౌన్స్ చెయ్యడమే.. రికార్డులు సృష్టించిన సినిమాలు ఇవే..!

ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి అప్డేట్ రావడమే.. సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్నారు వారు అభిమానులు. అది బర్త్ డే ట్రెండ్ ట్యాగ్ కావచ్చు, స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి యానివర్సరీ ట్రెండ్ ట్యాగ్ కావచ్చు.. ఇలా ఏదైనా కావచ్చు. ఆ ట్యాగ్ తో ఎక్కువ ట్వీట్లు వేసి… పాత రికార్డులను బ్రేక్ చేసి.. సరికొత్త రికార్డులు వారి అభిమాన హీరోల పేరు ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా.. అసాధారణం అనుకున్న రికార్డులను సైతం బ్రేక్ చేసి చూపిస్తున్నారు స్టార్ హీరోల అభిమానులు. ట్విట్టర్లో ఎక్కువగా.. ట్యాగ్ లతో ట్రెండ్ సెట్ చేస్తుండటం జరుగుతుంది.

గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం టైటిల్ ట్యాగ్ తో 1 మిలియన్ ట్రెండ్ అనేది మొదలైంది. 24 గంటల్లో 2 మిలియన్ కొట్టిన ట్యాగ్ కూడా అదే. మహేష్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన రికార్డుని పవన్ ఫ్యాన్స్ ‘వకీల్ సాబ్’ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ట్యాగ్ తో బ్రేక్ చేశారు. ఇక పవన్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన రికార్డుని మళ్ళీ ‘సర్కారు వారి పాట’ తో మహేష్ ఫ్యాన్స్ మళ్ళీ బ్రేక్ చేశారు. ‘#SarkaruVaariPaata’ ట్యాగ్ పై 4 మిలియన్ ట్వీట్స్ పైనే నమోదయ్యాయి. ఇక 24 గంటల్లో టాప్ 10 లో నిలిచినవి ఏవేమి సినిమాల టైటిల్ పోస్టర్సో .. ఓ లుక్కేద్దాం రండి.

1) సర్కారు వారి పాట (#SarkaruVaariPaata) : 4.4 మిలియన్ ట్వీట్స్

2)వకీల్ సాబ్ ( #VakeelSaabFirstLookFestival) : 3.5 మిలియన్ ట్వీట్స్

3) సరిలేరు నీకెవ్వరు (#SarileruNekevaru) : 2.4 మిలియన్ ట్వీట్స్

4) మహర్షి (#Maharshi) : 858K ట్వీట్స్

5) ఆర్.ఆర్.ఆర్(#RoudramRanamRudhiram) : 727K ట్వీట్స్

6) నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా( #NSNIFirstLookImpact ) : 710K ట్వీట్స్

7) భరత్ అనే నేను ( #BharatAneNenu) : 610K ట్వీట్స్

8) పుష్ప (#PushpaFirstLook) : 594K ట్వీట్స్

9) రంగస్థలం(#Rangasthalam) : 355K ట్వీట్స్

10) అరవింద సమేత(#AravindhaSametha) : 340K ట్వీట్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus