టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలకు స్టార్ డైరెక్టర్లతో పని చేసే ఛాన్స్ రావడం లేదు. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల లాంటి దర్శకులు కేవలం అగ్ర హీరోలతో తప్ప మిగిలిన వారితో సినిమాలు చేయరు. దీంతో టాలీవుడ్ మిడ్ రేంజ్ లో ఉన్న హీరోల మార్కెట్ పెరగడం లేదు. ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ తో పని చేసే అవకాశం ఉందని తెలుసుకున్న యంగ్ హీరోలు.. ఆ ఛాన్స్ కోసం ఎగబడుతున్నారు.
దీనికోసం రెమ్యునరేషన్ కూడా వద్దంటున్నారట. గతంలో నితిన్ హీరోగా త్రివిక్రమ్ ‘అ ఆ’ అనే సినిమాను రూపొందించాడు. దీనికోసం నితిన్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. నిర్మాతలు రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా.. నితిన్ రిజెక్ట్ చేశాడు. ఇలానే ఇప్పుడు కొందరు యంగ్ హీరోలు త్రివిక్రమ్ తో సినిమా అంటే ఫ్రీగా చేస్తామంటూ ముందుకొస్తున్నారట. త్రివిక్రమ్ తో సినిమా చేస్తే తమ రేంజ్ పెరుగుతుందనే.. ఇలా ఫ్రీగా సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకున్న త్రివిక్రమ్.. ఆ ప్రాజెక్ట్ ఆలస్యమవుతుండడంతో ఒక మిడ్ రేంజ్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై త్రివిక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రామ్ తో సినిమా చేస్తాడని వార్తలు వినిపిస్తున్నా.. దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. రామ్ కి ఛాన్స్ ఉందనేసరికి మిగిలిన హీరోలకు కూడా ఆశ పుట్టిందట. అయితే త్రివిక్రమ్ మాత్రం ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్నాడని సమాచారం. మరేం జరుగుతుందో చూడాలి!
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?