బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు.!

నందమూరి నట వారసుడిగా తర్క రామారావు గారి కళను పుణికి పుచ్చుకుని…నటుడిగా తనకంటూ మాస్ ఫాలోయింగ్…ఫాన్స్ ని సాధించుకున్నారు మన బాలయ్య బాబు. తాతమ్మ కల అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్టీఆర్ తో ఆక్ట్ చేసిన ఆ తరువాత సాహసమే జీవితం సినిమాతో సోలో హీరోగా ఆరంగేట్రం చేసారు. మంగమ్మ గారి మనవడు సినిమా బాలయ్య కెరీర్లో పెద్ద హిట్ అవ్వడం తో ఆ తరువాత బాలకృష్ణ వెను తిరిగి చూసుకోలేదు.

ముద్దులు కృష్ణయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369 పెద్ద అన్నయ్య, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు నుండి సింహ, లెజెండ్, అఖండ వరకు బాలయ్య చేసిన సినిమాలు ఒక్కోటి ఒక్కో మాస్ హిట్స్. నలభై ఏళ్ళ సినిమా కెరీర్, 100 కు పైగా సినిమాలు ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, ఎన్నో సూపర్ హిట్స్.

100 కు పైగా సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన… 10 బాలయ్య సినిమాల లిస్ట్ చూస్తే …

10. ఎన్.టి.ఆర్. కథానాయకుడు

గ్రాస్ కలెక్షన్స్: Rs 20+ Cr

స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం అయినా ఈ సినిమా అస్సల ఆడలేదు…సొంత బ్యానర్లో బాలయ్యే నిర్మించిన ఈ సినిమాకి నష్టాలు వచ్చాయి.

9. లక్ష్మి నరసింహ


గ్రాస్ కలెక్షన్స్: Rs 22+ Cr

జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మి నరసింహ మూవీ సూపర్ హిట్ టాక్ తో Rs 20+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఆర్జించింది.

8. నరసింహ నాయుడు

WW గ్రాస్ కలెక్షన్స్:: Rs 25+ Cr

బాలయ్య కెరీర్లో కల్ట్ హిట్ నరసింహ నాయుడు సినిమా కలెక్షన్స్ తో కొత్త రికార్డ్స్ సెట్ చేసింది…ఈ సినిమా అప్పట్లోనే 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది మరి.

7. సమరసింహా రెడ్డి

గ్రాస్ కలెక్షన్స్: Rs 25+ Cr

ఫ్యాక్షన్ అనే సినిమా జనర్ ని మన తెలుగు వాళ్ళకి పరిచయం చేసారు…బాలయ్య ఈ సినిమాతో. సమరసింహా రెడ్డి అనే సినిమా బాలయ్య కెరీర్లోనే కాదు మన తెలుగు సినిమా లోనే ఒక చరిత్ర సృష్టించిన సినిమా.

6. పైసా వసూల్

గ్రాస్ కలెక్షన్స్: 30+ Cr

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన పైసా వసూల్ సినిమా బాలయ్యని చాల కొత్తగా చూపించింది… ఈ సినిమాకి గొప్ప హిట్ రాలేదు కానీ యావరేజ్ టాక్తో మంచి కలెక్షన్ సృష్టించింది.

5. జై సింహ

గ్రాస్ కలెక్షన్స్: 48-50 Cr

బాలకృష్ణ & నయనతార నటించిన జై సింహ సినిమాని రవికుమార్ తెరకెక్కించారు…సంక్రాతి కి విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ హిట్ అయింది.

4. సింహ

గ్రాస్ కలెక్షన్స్: 50+ Cr

ఇక మొదటి సరి బోయపాటి-బాలయ్య కంబినేషన లో వచ్చిన సింహ సినిమా మాస్ హిట్ అవ్వడమే కాకుండా మంచి కలెక్షన్స్ రాబట్టింది.

3. లెజెండ్

గ్రాస్ కలెక్షన్స్: Rs 65+ Cr

బాలయ్య బోయపాటిలా మాస్ కాంబినేషన్ లో వచ్చిన మరో హిట్ సినిమా…లెజెండ్ మరి సారి ఈ ఇద్దరు మాస్ సినిమా రుచి చూపించి మాస్ హిట్ కొట్టారు.

2. గౌతమీపుత్ర శాతకర్ణి

గ్రాస్ కలెక్షన్స్: 80+ Cr

గౌతమీపుత్ర శాతకర్ణి, బాలయ్య బాబు కెరీర్ లో వందో సినిమా… దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమా హిట్ టాక్ తో ఎనభై కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

1. అఖండ

గ్రాస్ కలెక్షన్స్: Rs 120+ Crores గ్రాస్

ఇక బాలయ్య కెరీర్లో అఖండ సినిమా ఒక శివ తాండవం అని చెప్పొచ్చు…ఈ సినిమాలో అఘోర గా బాలయ్య నట విశ్వరూపం చూపించారు. అఖండ బాలయ్య బాబు కెరీర్లో మొదటి వంద కోట్ల సినిమా.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus