Tollywood Heroes: ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువమంది ఫాలో చేస్తున్న టాప్ 10 తెలుగు హీరోలు వీళ్లే..

మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా అనేవి చాలా ఇంపార్టెంట్ విషయాలుగా మారిపోయాయి.. పొద్దున లేస్తే.. వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ముచ్చట్లే.. అందులోనూ స్టార్లకి అయితే బీభత్సమైన ఫాలోయింగ్.. వారి నుండి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా క్షణాల్లో వరల్డ్ వైడ్ వైరల్ అయిపోతుంది.. ముఖ్యంగా వాళ్లు షేర్ చేసే పర్సనల్ విషయాలు ఫ్యాన్స్, నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి.. అందుకే వాళ్లని మిలియన్ల కొద్దీ ఫాలో అవుతుంటారు.. ఎక్కువ ఫాలోవర్లతో రికార్డ్ క్రియేట్ చేశారు మన టాలీవుడ్ స్టార్ హీరోస్ .. దీని గురించి ఫ్యాన్స్ మధ్య పెద్ద పెద్ద డిస్కషన్స్ కూడా జరుగుతుంటాయి.. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న టాప్ 10 తెలుగు హీరోలెవరో, వాళ్ల ఫాలోయింగ్ ఎలా ఉంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

1) అల్లు అర్జున్..

ఐకాన్ స్టార్ (Heroes) అల్లు అర్జున్.. 20.3 మిలియన్ల ఫాలోవర్లతో అందరికంటే టాప్‌లో ఉన్నాడు..

2) విజయ్ దేవరకొండ..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను 17.9 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు..

3) రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 13.6 మిలియన్లతో మూడో స్థానంలో ఉన్నాడు..

4) మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబుకి 10.1 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు..

5) ప్రభాస్..

గ్లోబల్ స్టార్ ప్రభాస్ 9.3 మిలియన్ల మంది ఫాలోవర్లతో ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నాడు..

6) జూనియర్ ఎన్టీఆర్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఫాలోవర్స్ 5.9 మిలియన్లు..

7) నాని..

నేచురల్ స్టార్ నాని కూడా తారక్ లానే 5.9 మిలియన్ల మంది ఫాలోవర్స్ కలిగి ఉండడం విశేషం..

8) రామ్ పోతినేని..

ఉస్తాద్ రామ్ పోతినేనిని 3.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు..

9) వరుణ్ తేజ్..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 3 మిలియన్ల ఫాలోవర్లతో 9వ స్థానంలో నిలిచాడు..

10) అఖిల్ అక్కినేని..

అక్కినేని యంగ్ హీరో అఖిల్ కూడా 3 మిలియన్స్ ఫాలోవర్స్‌తో 10వ ప్లేసులో ఉన్నాడు..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus