Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పాటల్లో అన్నా చెల్లెళ్ల అనురాగం

పాటల్లో అన్నా చెల్లెళ్ల అనురాగం

  • August 18, 2016 / 06:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాటల్లో అన్నా చెల్లెళ్ల అనురాగం

తండ్రిలా కంటికి రెప్పలా కాపాడే అన్నయ్య, తల్లిలా ప్రేమ కురిపించే చెల్లెలు. కాసేపు పోట్లాడుకొని.. క్షణంలో కలిసిపోయే వీరి మధ్య అనుబంధాన్ని కొన్ని మాటల్లో చెప్పడమంటే కష్టమే. కానీ సినీ కవులు పాటల రూపంలో అన్నాచెల్లెళ్ల అనురాగాన్ని నింపారు. వాటికి మధురమైన బాణీలు కట్టి సంగీత జ్ఞానులు మనకి అందించారు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆ పాటలు శాశ్వతంగా నిలిచిపోతాయి. నేడు (ఆగస్టు 18) రాఖీ పండుగ సందర్బంగా ఆ అపురూప గీతాల గురించి పరిచయం చేస్తున్నాం.

చిట్టి చెల్లెలు

మహానటుడు నందమూరి తారక రామారావు నటిస్తున్నప్పటికీ “చిట్టి చెల్లెలు” టైటిల్ పెట్టి కథకు పూర్తి న్యాయం చేశారు. ఇందులో ఎన్టీఆర్ చెల్లెలి కోసం తాపత్రయం పడే అన్నగా పాత్రకు ప్రాణం పోశారు. ఈ సినిమా ప్రారంభంలో వచ్చే “అందాల పసిపాప.. అన్నయ్యకు కనుపాప .. బజ్జోవే బుజ్జాయి” పాట ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకుంది.

రక్త సంబంధం

https://www.youtube.com/watch?v=XBujIffX5zE

రామారావు, సావిత్రి అన్న చెల్లెలుగా నటించిన “రక్త సంబంధం” ఓ ఆణిముత్యం. ఈ సినిమాలో ఇద్దరు పోటీ పడి నటించారు. ఇందులోని “చందురుని మించు అందములొలికించు” పాట అద్భుతం. ఈ పాటలో “కంటిలో పాప, ఇంటికే జ్యోతి, చెల్లి నా ప్రాణమే” అంటూ మహానటుడు పాడుతుంటే మహిళల కంట కన్నీరు ఆగలేదు.

బంగారు గాజులు

అక్కినేని నాగేశ్వర రావు, విజయ నిర్మల అన్న చెల్లెళ్లుగా నటించిన సినిమా “బంగారు గాజులు”. ఈ చిత్రం కోసం ప్రముఖ రచయిత సి.నారాయణ రెడ్డి రాసిన “అన్నయ్య సన్నిధి.. అదే నాకు పెన్నిధి, కనిపించని దైవమే.. ఆ కనులులోనా ఉన్నదీ” పాట అందరి నోటా మెప్పుఅందుకుంది. పి.సుశీల గాత్రంలో ఈ పాట అజరామరంగా నిలిచింది.

ఆడపడుచు

ఆడపడుచు చిత్రంలో చంద్ర లేఖకు అన్నయ్యలుగా మహా నటుడు ఎన్టీఆర్, సోగ్గాడు శోభన్ బాబు నటించారు. పుట్టినరోజున అన్నల దీవెన వెన్నెల కన్నా చల్లదనం అంటూ సాగే “అన్నా నీ అనురాగం.. ఎన్నో జన్మల పుణ్య ఫలం “.. పాటను సుశీల ఎంతో చక్కగా పాడారు. అప్పట్లో ఈ సినిమా 5 కేంద్రాల్లో వంద రోజులకంటే ఎక్కువగా ఆడింది.

ముద్దుల మామయ్య

https://www.youtube.com/watch?v=TctaKb0sqGw

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ముద్దుల మామయ్య సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణకు సీత చెల్లెలుగా నటించింది. ఇందులో “మామయ్య అన్న పిలుపు” పాట హుషారుగా సాగి బాలకృష్ణ అభిమానులనే కాకుండా తెలుగు మహిళలందరినీ అలరించింది. “అరచేత పెంచాను చెల్లిని.. ఈ అరుదైన బంగారు తల్లిని.. ” అంటూ బాలయ్య పాడి ఆడపడుచులకు అన్నయ్యాడు.

హిట్లర్

వరుస అపజయాలు ఎదురవుతుంటే మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ సెంటిమెంట్ ని నమ్ముకున్నాడు. ఐదు మంది చెల్లెళ్లకు అన్నగా హిట్లర్ చిత్రంలో నటించి విజయం సొంతం చేసుకున్నాడు. ముత్యాలు సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ” కన్నీళ్ళకే కన్నీళ్లొచ్చే” పాటతో కన్నీళ్లు తెప్పించాడు. “అమ్మలోని లాలన, నాన్నలోని పాలన, అందిపుచ్చుకున్న అన్న నీడలో” అంటూ అన్న చెల్లెలు పాడే తీరు అన్నలకు బాగా నచ్చింది.

పుట్టింటికి రా చెల్లి

అన్న చెల్లెలుగా అర్జున్, స్వాతి నటించిన “పుట్టింటికి రా చెల్లి” సినిమాను మహిళా లోకం మెచ్చింది. మొదలు నుంచి చివరి వరకు సెంటిమెంట్ సీన్లతో నిండిన ఈ చిత్రానికి పాటలు ప్రాణం పోశాయి. ప్రధానంగా “చామంతి, పూబంతి .. చిన్నారి నా సిరిమల్లె “, “పుట్టింటికి రావే చెల్లి అని పిలిచింది మన ఇంటి తల్లి” పాటలు గుర్తిండి పోయాయి.

ఒరేయ్ రిక్షా

దర్శకరత్న దాసరి నారాయణ మూర్తి, విప్లవ సినిమాలు తీసే ఆర్.నారాయణ మూర్తి కలిసి మనకు అందించిన అపురూప చిత్రం ఒరేయ్ రిక్షా. ఇందులో వందేమాతరం శ్రీనివాస్ స్వరపరచి, ఆలపించిన “మల్లె తీగకు పందిరి ఓలే .. మసక చీకటిలో వెన్నెల ఓలే .. నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా..తోడ బుట్టిన ఋణం తీర్చుకుంటనే చెల్లెమ్మా ” పాట ఆ యేడాది మొత్తం మారుమోగింది. ఇప్పటికీ వందేమాతరం శ్రీనివాస్ కనిపిస్తే ఎంతో మంది ఈ పాట పాడమని అడుగుతుంటారు.

అన్నవరం

ప్రేమ కథ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన చెల్లెలి సెంటిమెంట్ చిత్రం అన్నవరం. ఇందులో పవన్ కి చెల్లెలుగా తమిళ హీరోయిన్ సంధ్య నటించింది. వీరి అనుబంధం నేటి తరం వారికి బాగా నచ్చింది. ఇందులోని “అన్నయ్య అన్నావంటే అంటే ఎదురవనా, అలుపై ఉన్నానంటే నిదురవనా.. చెల్లి పోనీ బంధం నేన్నమ్మ చిట్టి చెల్లమ్మ, వెళ్లి పోనీ చుట్టం నేనమ్మా” అనే పాటను రమణ గోగుల కొత్తగా స్వరపరచి పది కాలాల పాటు నిలిచేలా చేశారు.

గోరింటాకు

అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచినా గోరింటాకు సినిమా పేరుతో 2008 లో మరో చిత్రం వచ్చింది. ఇందులో రాజశేఖర్, మీరా జాస్మిన్ అన్నా చెల్లెలుగా నటించారు. కమర్షియల్ హిట్ సాధించకపోయినా మంచి చిత్రంగా పేరు సంపాదించుకుంది. ఈ మూవీ కోసం ప్రముఖ సంగీత దర్శకులు ఎస్.ఏ.రాజ్ కుమార్ స్వరపరిచిన
“అన్నా చెల్లిలి అనుబంధం.. జన్మ జన్మల సంబంధం” అనే పాట అందరీ మనసులను కదిలించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Annavaram Songs
  • #Gorintaku Songs
  • #Rakhi Songs
  • #Sisters Songs
  • #Tollywood Movies

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

9 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

9 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

10 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

15 hours ago

latest news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

10 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

11 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

12 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

13 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version