ఒకప్పుడంటే స్టార్ హీరోలకు కోట్లాది రూపాయల పారితోషికాలు ఇచ్చే దర్శక నిర్మాతలు.. హీరోయిన్లకు మాత్రం అర కొర ఇచ్చి సరిపెట్టేవారు. ఈ మాట పలువురు హీరోయిన్లు మీడియా ముందే చెప్పారు. ఒక్కసారి హిట్ పడి, స్టార్ డమ్ వచ్చిందంటే చాలు.. వాళ్లు కూడా డిమాండ్ చేయడం మొదలెడుతున్నారు. ఆ హిట్స్ కౌంట్ పెరిగే కొద్దీ.. రెమ్యునరేషన్ కూడా పెంచుతూ ఉంటారు.. ఈ 2022లో నేమ్, ఫేమ్ ఉన్న 15 మంది హీరోయిన్లు.. ఎవరు ఎన్నేసి సినిమాలు చేశారు?.. ఎవరు ఎన్నేసి కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకున్నారు?.. అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
1. నయనతార.. రూ. 15 – 20 కోట్లు ( 6 సినిమాలు)..
లేడీ సూపర్ స్టార్ నయనతార ‘కాతువాక్కుల రెండు కాదల్’ (తెలుగులో కణ్మని రాంబో ఖతీజా), ‘O2’ (ఆక్సిజన్ – OTT), ‘గాడ్ ఫాదర్’, -గోల్డ్’ సినిమాలు చేసింది.. ‘కనెక్ట్’, ‘జవాన్’ మూవీస్ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి..
2. రష్మిక మందన్న.. రూ. 10 – 15 కోట్లు (6 సినిమాలు)..
కన్నడ చిన్నది రష్మిక ఈ సంవత్సరం ఆరు చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’, ‘సీతా రామం’, ‘వరిసు’ (వారసుడు), ‘గుడ్‌బై’, ‘మిషన్ మజ్ను, ‘యానిమల్’..
3. పూజా హెగ్డే.. రూ. 10 – 15 కోట్లు (5 సినిమాలు)..
పూజా హెగ్డే 5 సినిమాలతో మూడో స్థానంలో ఉంది.. ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’, ‘ఎఫ్ 3’ (స్పెషల్ సాంగ్), ‘సర్కస్’..
4. కీర్తి సురేష్.. రూ. 7 – 10 కోట్లు (4 సినిమాలు)..
‘గుడ్ లక్ సఖి’, ‘సాని కాయిధం’ (చిన్ని), ‘వాసి’, ‘సర్కారు వారి పాట’..
5. కృతి శెట్టి.. రూ. 5 – 6 కోట్లు (4 సినిమాలు)..
‘బంగార్రాజు’, ‘ది వారియర్’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మాచర్ల నియోజకవర్గం’..
6. సమంత.. రూ. 4 – 5 కోట్లు.. (2 సినిమాలు)..
సౌత్ క్వీన్ సమంత ఈ ఏడాది ‘కాతువాక్కుల రెండు కాదల్’ (తెలుగులో కణ్మని రాంబో ఖతీజా), ‘యశోద’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది..
7. నిత్య మీనన్.. రూ. 3 – 4 కోట్లు.. (4 సినిమాలు)..
‘భీమ్లా నాయక్’, ‘తిరు’, ‘19 (1) (ఎ), ‘వండర్ వుమెన్’ (ఓటీటీ)..
8. రాశీ ఖన్నా.. రూ. 3 – 4 కోట్లు.. (4 సినిమాలు)..
‘పక్కా కమర్షియల్’, ‘థ్యాంక్యూ’, ‘తిరుచిత్రంబలం’, ‘సర్దార్’..
9. తమన్నా.. రూ. 3 – 4 కోట్లు.. (4 సినిమాలు)..
‘ఎఫ్ 3’, ‘బబ్లీ బౌన్సర్’ (ఓటీటీ), ‘ప్రాన్ ఎ ప్లాన్ బి’, ‘గని’ (స్పెషల్ సాంగ్)..
10. ఐశ్వర్య లక్ష్మీ.. రూ. 3 – 5 కోట్లు.. (5 సినిమాలు)..
‘కెప్టెన్’, ‘అమ్ము’, ‘పిఎస్-1’, ‘కుమారి’, ‘గట్ట కుస్తీ’ (మట్టి కుస్తీ)..
11. సాయి పల్లవి.. రూ. 2 – 3 కోట్లు.. (2 సినిమాలు)..
‘విరాట పర్వం’, ‘గార్గి’..
12. అనుపమ పరమేశ్వరన్.. రూ. 2 – 3 కోట్లు.. (4 సినిమాలు)..
‘రౌడీ బాయ్స్’, ‘కార్తికేయ 2’, ‘బట్టర్ ఫ్లై’, ‘18 పేజీస్’..
13. ప్రియాంక అరుళ్ మోహన్.. రూ. 2 – 3 కోట్లు.. (2 సినిమాలు)..
‘ఈటీ’, ‘డాన్’..
14. శృతి హాసన్.. రూ. 2 – 3 కోట్లు.. (3 సినిమాలు)..
‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘సలార్’..
15. త్రిష.. రూ. 2 కోట్లు (1 సినిమా)..
‘పొన్నియిన్ సెల్వన్ – 1’..