SSMB29: టీమ్ లోకి మరో అగ్ర నిర్మాత కూడా.. ఎందుకంటే..!

సూపర్‌స్టార్ మహేష్ బాబు  (Mahesh Babu) , రాజమౌళి(S. S. Rajamouli)   కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 ప్రాజెక్ట్‌ రోజుకో అప్‌డేట్‌తో మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, ఈ ప్రాజెక్ట్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా శోభు యార్లగడ్డను చేర్చినట్లు టాక్ వినిపిస్తోంది. బాహుబలి సిరీస్‌తో శోభు-రాజమౌళి కాంబినేషన్ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ జోడీ మరింత బలంగా ఈ మెగాప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లబోతుందని భావిస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానుండటంతో ప్రాజెక్ట్‌కి శోభు అనుభవం కీలకంగా మారనుంది.

SSMB29

గతంలో బాహుబలి (Baahubali) మరియు RRR (RRR) వంటి ప్రాజెక్ట్‌లలో అంతర్జాతీయ మార్కెటింగ్‌ వ్యూహాలను సిద్ధం చేయడంలో శోభు కీలక పాత్ర పోషించారు. అతని అనుభవం ఇప్పుడు SSMB29 విషయంలో కూడా విజయానికి దారితీస్తుందని భావిస్తున్నారు. SSMB29 KL నారాయణ నిర్మాణంలో జై దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకోబోతుంది. అయితే ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అంత భారీ బడ్జెట్‌కు తగిన విధంగా ప్రాజెక్ట్‌ను నిర్వహించడానికి శోభు అనుభవం కీలకంగా మారనుంది.

అంతేగాక, ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కోసం విభిన్న డిస్ట్రిబ్యూషన్ వ్యూహాలను సిద్ధం చేయడంలో శోభు కీలక పాత్ర పోషించబోతున్నారు. ప్రస్తుతం చిత్రబృందం లొకేషన్స్ ఫైనలైజేషన్, వర్క్‌షాప్‌లు మొదలుపెట్టే దిశగా ప్రణాళికలు వేస్తోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉండే కథాంశం, గ్రాండ్ యాక్షన్ సీక్వెన్సులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

వీటన్నిటినీ ప్రపంచ స్థాయి టెక్నాలజీతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నదే రాజమౌళి లక్ష్యం. బాలీవుడ్ నుంచే కాకుండా అంతర్జాతీయంగా కూడా సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని చిత్రబృందం కృషి చేస్తోంది.

పుష్ప 2 మొదటి రేసులో దేవరను కూడా దాటలేదుగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus