Roshan: పెద్ద బ్యానర్లు పట్టేసిన హీరో కొడుకు!

Advertisement

తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తూ.. భారీ లాభాలను పొందుతున్నారు నిర్మాతలు. అందుకే అగ్ర నిర్మాతలు కూడా చిన్న సినిమాలపై దృష్టి పెడుతున్నాయి. ‘జాతిరత్నాలు’తో చిన్న సినిమాల వలన ఎంత లాభమొస్తుందో అశ్వనీదత్ లాంటి నిర్మాతకు బాగా బాగా అర్ధమైంది. అందుకే ఇప్పుడు మరో చిన్న సినిమా మొదలుపెట్టాలని చూస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై.. అశ్వనీదత్ నిర్మాతగా ఓ చిన్న సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు.

కథ మొత్తం సిద్ధంగా ఉంది. మిగిలిన అన్ని వివరాలు త్వరలోనే ప్రకటనించనున్నారు. రోషన్ చేతిలో మరో సినిమా కూడా ఉందని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ రోషన్ తో మరో సినిమా నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్‌. ఈ సినిమా తరువాత కొంత గ్యాప్‌ తీసుకొని ‘పెళ్లి సందడి’ సినిమాతో అలరించాడు. అయితే ఈ సినిమా అనుకున్నంతగా ఆశించకపోయినా రోషన్‌ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

రోష‌న్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండ‌డం, డాన్సులు బాగా చేయ‌డంతో వరుస ఆఫర్లు వస్తున్నాయి. అది కూడా పెద్ద బ్యానర్లు కావడం విశేషం. ముందుగా వైజ‌యంతీ మూవీస్ బ్యానర్ లో సినిమాను పూర్తి చేస్తాడు. ఆ త‌ర‌వాత‌… సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సినిమా ప‌ట్టాలెక్కుతుంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read