The Raja Saab: రాజా సాబ్ లో టాప్ మోస్ట్ కమెడియన్స్.. మారుతి క్రేజీ ప్లాన్స్!

ప్రభాస్ (Prabhas)  ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా పాన్ వరల్డ్ సినిమాలు చూస్తూ గ్రాండియర్ బాగా అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు డార్లింగ్ మళ్లీ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ (The Raja saab)  సినిమా హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతుండటంతో అంచనాలు పీక్‌లో ఉన్నాయి. ఇందులో ప్రభాస్ పాత్ర పూర్తిగా న్యూలుక్‌లో ఉంటుందని టాక్. అయితే ఇప్పుడు ఈ సినిమాకు అసలు హైలైట్ ఎవరంటే.. టాప్ కమెడియన్స్ అని తెలుస్తోంది.

The Raja Saab

ఇండస్ట్రీలో ఒకప్పుడు జంధ్యాల, ఈవీ వెంకటేశ్ సినిమాల్లో కామెడీ ఒక ప్రామిస్డ్ ప్యాకేజీగా ఉండేది. బ్రహ్మానందం (Brahmanandam), అలీ (Ali), ఎమ్.ఎస్. నారాయణ  (M. S. Narayana) , సునీల్ (Sunil) లాంటి కమెడియన్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ సీన్లు ఆటోమాటిక్‌గా హిట్. చాలా కాలంగా ఆ ప్యాటర్న్ తప్పిపోగా.. ఇప్పుడు మారుతి ఆ ట్రెండ్‌ను రిపీట్ చేయనున్నాడట. ఈ సినిమాలో కామెడీ బ్లాక్‌లు పక్కా హిలేరియస్‌గా ఉంటాయని, ప్రేక్షకులు నవ్వుతూ థియేటర్‌ నుంచి బయటకు వస్తారని చెప్పుకుంటున్నారు.

రాజా సాబ్ (The Raja Saab) సినిమాలో కమెడియన్ లైన్‌ప ఒక రేంజ్‌లో ఉందని టాక్. బ్రహ్మానందం, అలీ లాంటి సీనియర్ లెజెండ్స్‌తో పాటు యంగ్ సెన్సేషన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore), సప్తగిరి (Sapthagiri), గెటప్ శ్రీను (Getup Srinu) లాంటి వాళ్లు కామెడీ పంచ్‌లు వేయబోతున్నారట. అంతే కాదు, కోలీవుడ్ నుంచి యోగిబాబు (Yogi Babu), వీటీవీ గణేష్‌లను (VTV Ganesh) కూడా మారుతి బుక్ చేసుకున్నాడట. వీరందరూ స్క్రీన్ షేర్ చేసుకున్న సీన్లు హిలేరియస్‌గా వచ్చాయని, స్పెషల్ స్క్రిప్ట్ కూడా రాయించినట్లు తెలుస్తోంది.

మారుతి కామెడీ సినిమాల్లో హీరో క్యారెక్టర్ కన్నా కమెడియన్స్ గ్యాంగ్‌కే ఎక్కువ స్కోప్ ఇస్తాడనే సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజా సాబ్‌లో కూడా ఆ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడట. కేవలం హారర్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు, ప్రతి సీన్‌లోనూ పంచ్‌లు, సన్నివేశాలు ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించేలా ఉండబోతున్నాయని అంటున్నారు. ఇక రిలీజ్ విషయానికి వస్తే.. ముందుగా ఏప్రిల్ 10ని అనుకున్నారు. కానీ ఇప్పుడు దసరా హాలిడే సీజన్‌లో రిలీజ్ చేస్తే, బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేకుండా మంచి వసూళ్లు రాబట్టొచ్చనే ప్లాన్‌లో ఉన్నారట.

పాన్ ఇండియా సినిమాలకి ‘ఛావా’ ఓ పాఠం!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus