అదరగొడుతోన్న టచ్ చేసి చూడు ట్రైలర్!

నూతన దర్శకులను ప్రోత్సహించడంలో రవితేజ ఎల్లప్పుడూ ముందు ఉంటారు. అలాగే ఈసారి కూడా విక్రమ్ సిరికొండ ని డైరక్టర్ గా పరిచయం చేస్తూ “టచ్ చేసి చూడు” సినిమాని చేశారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన ఈ మూవీ టీజర్ సంచలనం సృష్టించింది. నేడు రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ మరోమారు దేశద్రోహులను చెడుగుడు ఆడుకోబోతున్నట్లు ఈ వీడియో స్పష్టం చేసింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ కానున్నాయి.

వక్కంతం వంశీ రాసిన ఈ కథలో మాస్ మహారాజ్ కనిపిస్తున్న విధానం థియేటర్ ని చప్పట్లతో నింపడం గ్యారంటీ అని అర్ధమవుతోంది.  రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకను రేపు (శనివారం)  నిర్వహించనున్నారు. ప్రీతమ్ స్వరపరిచిన పూర్తి పాటలకోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 2 న విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus