Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?
- September 7, 2026 / 06:43 PM ISTByPhani Kumar
‘బిగ్ బాస్ సీజన్ 10′(Bigg Boss 10 Telugu) షో నిన్న అంటే సెప్టెంబర్ 6న గ్రాండ్ గా ప్రారంభమైంది. 16 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి వెళ్లారు. మొదటి రోజు కంటెస్టెంట్లు అంతా హౌస్లో సెటిల్ అవ్వడానికి కొంచెం టైమ్ పడుతుంది. కాబట్టి.. మొదటి సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ఉండదు. కానీ హౌస్ మేట్స్ లో ఒకరిపై మరొకరికి ఎలాంటి ఒపీనియన్ ఉంది.. వాటిని ఎలా మార్చాలి అనే స్కెచ్చులు బిగ్ బాస్ వేసుకుంటున్నట్టు ఉన్నాడు. అందుకు తగ్గట్టే.. టాస్కులు డిజైన్ చేస్తున్నాడు అని చెప్పుకోవాలి.
Bigg Boss 10 Telugu, Trigun

విషయం ఏంటంటే.. ఈరోజు అనగా మొదటి సోమవారం నాడు 3 ప్రోమోలు వదిలాడు బిగ్ బాస్. అందులో 2 ప్రోమోలను గమనిస్తే.. త్రిగుణ్..ని(Trigun) హౌస్మేట్స్ అంతా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఆదివారం నాడు ఆడించిన టాస్కుల్లో బాగా పెర్ఫార్మ్ చేయని వాళ్ళ గురించి త్రిగుణ్.. తోటి హౌస్మేట్స్ తో చర్చిస్తున్నట్టు ఉంది. ఈ క్రమంలో కొంతమంది త్రిగుణ్ వైఖరిని తప్పుబడుతున్నట్టు, అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు ప్రోమోల్లో చూపించాడు.
ప్రోమోల్లో కావాలని త్రిగుణ్ టార్గెట్ అయినట్టు చూపిస్తున్నారా? లేక కావాలనే త్రిగుణ్ ను టార్గెట్ చేస్తున్నారా? అనేది ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూస్తేనే కానీ ఓ క్లారిటీ రాదు. మరోవైపు హౌస్మేట్స్ అందరి మ్యాజిక్ కీస్ తో ఒక టాస్క్ ఆడించాడు బిగ్ బాస్. ఒక్కో కంటెస్టెంట్ వెళ్ళి తమ మ్యాజిక్ కీకి సంబంధించిన బాక్స్ ను అన్ లాక్ చేసి.. అందులో వారు కలిగి ఉన్న పవర్ ఏంటో చదివి బిగ్ బాస్ కి వినిపించాలి. ఆ తర్వాత ఆ బాక్స్ ను లాక్ చేసి ఎక్కడ నుండీ తీశారో అక్కడే పెట్టేయలి.
సో వాటిని ఆధారం చేసుకుని నామినేషన్స్ లో ట్విస్టులు ఉండబోతున్నట్టు ఈ ప్రోమోలు స్పష్టం చేశాయి. సో చూడాలి మరి మండే ఎలాంటి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో హౌస్ ఉండబోతుందో!














