సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన త్రిష, మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరోయిన్, తాజాగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారి అభిమానుల్లో చర్చకు దారి తీసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే త్రిష, తన డైలీ లైఫ్‌కు సంబంధించిన చిన్న విషయాలనూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల నిద్రపై చేసిన ఒక కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. తాను ఒక గంట నిద్ర కోల్పోతే, దాన్ని తిరిగి రికవర్ అవ్వడానికి నాలుగు రోజులు పడుతుందని, ఈ లెక్కన చూస్తే తాను పూర్తిగా రిలాక్స్ అయ్యేది చాలా సంవత్సరాల తర్వాతే అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ కొందరు నవ్వుకుంటే, మరికొందరు ఆమెపై ఉన్న పని ఒత్తిడి గురించి ఆలోచిస్తున్నారు.
ప్రస్తుతం త్రిష వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. కోలీవుడ్‌లో సూర్యతో కలిసి నటించిన కరుప్పు త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే చిత్రం తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో డబ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న ‘విశ్వంభర’ కూడా విడుదల దశలో ఉంది.
ఈ మధ్య త్రిష వ్యక్తిగత జీవితంపై కూడా వార్తలు వస్తుండటంతో, ఆమె చేసే ప్రతి పోస్ట్‌కు మరింత ప్రాధాన్యం పెరిగింది. అయితే ఆమె తాజా కామెంట్‌ను చాలామంది సరదాగా తీసుకుంటున్నప్పటికీ, షూటింగ్స్ కారణంగా వచ్చే అలసట మరియు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు కూడా అయిఉండొచ్చు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తానికి, చిన్న పోస్ట్‌తోనే పెద్ద చర్చకు దారి తీసే స్థాయిలో త్రిష క్రేజ్ ఉందని మరోసారి స్పష్టమైంది.