Trisha, Balakrishna : బాలయ్యతో మరోసారి త్రిష రొమాన్స్..!

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది త్రిష. దాదాపు అగ్ర హీరోలందరి సరసన కలిసి నటించింది. ఇక్కడ హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. అలానే ’96’ లాంటి కొన్ని క్లాసిక్స్ కూడా చేసింది. రీసెంట్ గా మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో మెరిసింది. ఇతర భాషల సంగతి పక్కన పెడితే తమిళంలో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా సక్సెస్ తో త్రిష క్రేజ్ మళ్లీ పెరిగింది. ఈ సినిమాలో త్రిష చాలా అందంగా కనిపించింది. ప్రమోషన్స్ లో అయితే ఐశ్వర్యారాయ్ ని కూడా డామినేట్ చేసింది. ఆ రేంజ్ లో ఆకట్టుకుంది. 40ల్లోకి చేరువవుతున్న త్రిష ఇప్పటికీ అదే అందంతో మెరిసిపోవడం విశేషం. దీంతో ఈమెకి మళ్లీ అవకాశాలు పెరుగుతున్నాయి. టాలీవుడ్ దర్శకులు కూడా ఆమె అవకాశాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. అందులో త్రిషను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఈ బ్యూటీ ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఎందుకంటే కథ ప్రకారం సినిమా బాలయ్యకు టీనేజర్ కూతురు ఉంటుంది. ఆ పాత్రలో శ్రీలీల కనిపించనుంది. తల్లి పాత్ర అంటే త్రిష వెనుకడుగు వేసే ఛాన్స్ ఉంది.

ఇదివరకు అయితే బాలయ్యతో కలిసి ‘లయన్’ అనే సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. మళ్లీ ఇంతకాలం తరువాత బాలయ్యతో మరోసారి నటించే ఛాన్స్ వచ్చింది. మరి దీనికి త్రిష ఒప్పుకుంటుందో లేదో చూడాలి!

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus