Pawan Kalyan: ‘AK’ రీమేక్‌ గురించి ఇవి నిజమేనా

Advertisement

పవన్‌ కల్యాణ్‌ సినిమా అంటే యాక్షనూ, మాస్ ఎలిమెంట్స్‌, ఎలివేషన్లూ ఉండాల్సిందే. అయితే అవి ఎంత ఎక్కువ ఉంటే అభిమానులు అంత ఆనందిస్తారు. ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ సినిమాను పవన్‌ తెలుగులో చేస్తున్నాడు అనగానే… ఆ సినిమాలో ఎలివేషన్‌ సీన్స్‌లో పవన్‌ ఎలా ఉంటాడని అభిమానులు లెక్కలేసుకుంటున్నారు. అయితే ఆ మోతాదును పెంచాలని చిత్రబృందం భావిస్తోందట. దీని కోసం సినిమాలు అదనపు సన్నివేశాలు రాసుకుంటున్నారట. ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌ కోసం త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్న విషయం తెలిసిందే.

దీంతోపాటు సినిమా కీలక పనుల్లో ఆయన చేయి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో భాగంగానే ఇప్పుడు యాడ్‌ ఆన్‌ సీన్స్‌, ఎలివేషన్లూ తెస్తున్నారట. మాతృకలో ఇద్దరు ప్రధానపాత్రధారుల మధ్య యాక్షన్ సీన్స్‌ అంటే… ఒక్కటే ఉంది. అది కూడా క్లైమాక్స్‌లో వస్తుంది. కానీ తెలుగులో మొత్తం నాలుగు యాక్షన్‌ సీన్స్‌ ఉంటాయట. ఆ నాలుగు యాక్షన్‌ సీన్స్‌లో వింటేజ్‌ పవన్‌ కల్యాణ్‌ కనిపిస్తాడని అంటున్నారు. గతంలో పవన్‌ చేసిన కాన్సెప్ట్‌ ఫైట్లకు చాలా పేరొచ్చింది.

ఇప్పుడు ఈ సినిమాలోనూ అలాంటి సీన్స్‌ను ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చట. ఇక ఎలివేషన్‌ సీన్స్‌ సంగతి చూస్తే… దర్శకుడు సాగర్‌ కె.చంద్ర ఇప్పటికే కొన్ని సీన్స్‌ రాసుకున్నారట. వాటికి గురూజీ టచ్‌ యాడ్‌ చేసి సినిమా చేస్తున్నారని టాక్‌.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus