త్రివిక్రమ్ ‘వెనకడుగు’ వేస్తున్నాడా???

ఒక పక్క ప్రిన్స్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం విడుదలకు సిద్దం అవుతున్న క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు మన సూపర్ స్టార్ మహేష్. ఇదిలా ఉంటే అదే క్రమంలో ఇండస్ట్రీ అంతా ఒక ముఖ్యమాిన విషయాన్ని గురించి చర్చించుకుంటుంది. ఆ విషయం ఏమిటంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యువ హీరో నితిన్, అందాల భామ సమంత కలసి నటించిన ‘అ ఆ’ సినిమా గురించే. ఇంతకీ విషయం ఏమిటంటే…అఆ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాకపోవడంతో ఆ సినిమా నిర్మాతలు కాస్త ఇబ్బందుల్లో పడ్డారు.

ఎప్పుడో ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన అఆ సినిమా మే నెల వచ్చినా ఇంకా ఈ సినిమా విడుదలపై క్లారిటీ రాకపోవడంతో చిత్ర యూనిట్ మొత్తం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ సినిమా ఎందుకు లేట్ అవుతుంది అంటే…ఈ నెల మొదటి వారంలో విడుదల్ చెయ్యాలి అనుకున్న క్రమంలో ఈ నెల 6న వచ్చిన సూరియ ’24’కు భయపడి సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసేసాడు త్రివిక్రమ్. అయితే అదే 24తో విడుదలయిన సాయి ధర్మ తేజ సుప్రీం మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. బడా స్టార్ సూర్యను కాదని దిల్ రాజు చేసిన ధైర్యం మన త్రివిక్రమ్ కు ఎందుకు ‘అ…ఆ’ విషయంలో ఎందుకు కలగలేదో అర్ధం కావడంలేదు. అయితే మరో పక్క టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వాదన ప్రకారం జూన్3న ఈ సినిమాను విడుదల చేసేందుకు ఆలోచనలు చేశాడు. అయితే ఈ నెల 20న వస్తున్న మహేష్ బ్రహ్మోత్సవం ను చూసి వెనక్కి తగ్గినట్లు టాక్. బ్రహ్మోత్సవం టాక్ సూపర్ అని వస్తే మరో పది రోజులు అఆ రిలీజ్ పోస్ట్ పోన్ చేయడం కన్ఫాం అని పక్కగా అర్ధం అయిపోతుంది. ఇలా ఎన్నాళ్లు త్రివిక్రమ్ సినిమాను వాయిదా వేస్తాడో కానీ, నితిన్ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి త్రివిక్రముడు ఎప్పటికీ కరుణిస్తాడొ చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus