షూటింగ్ మొదలైన మహేష్, త్రివిక్రమ్ ఫిల్మ్
- January 17, 2017 / 09:42 AM ISTByFilmy Focus
మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ కలయికలో వచ్చిన అతడు సూపర్ హిట్ అయింది. ఆ చిత్రం టీవీలో ఎప్పుడు వస్తున్నా అతుక్కుపోవాల్సిందే. అలాగే వీరి కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ఖలేజా కూడా నవ్వులు పూయించింది. వీరిద్దరి కాంబోలో రానున్న మూడో మూవీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రిన్స్ కూడా త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయనున్నట్లు కొంతకాలం క్రితం స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ మూవీ తర్వాత కొరటాల శివతో, ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మూడు చిత్రాల తర్వాత త్రివిక్రమ్ తో మూవీ మొదలవుతుంది. ఇందులో ఎటువంటి మార్పు లేదు.
మరి ఇప్పుడే షూటింగ్ ఏమిటి అనుకుంటున్నారా? ఇది యాడ్ ఫిల్మ్ షూటింగ్. రీసెంట్ గా మహేష్ బాబు ‘లాయిడ్’ ఎయిర్ కండిషనర్ల కంపెనీకి ప్రచారకర్తగా అంగీకరించారు. ఈ కంపెనీ వాణిజ్య ప్రకటనను షూట్ చేసే అవకాశం త్రివిక్రమ్ కి దక్కింది. మహేష్ తో అనేక యాడ్ ఫిల్మ్ షూట్ చేసిన మాటల మాంత్రికుడు ఈ యాడ్ ని కూడా స్వీట్ అండ్ షార్ట్ గా చిత్రీకరించేందుకు సిద్ధమయ్యారు. మురుగదాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ ప్రచార చిత్రం కోసం సమయాన్ని కేటాయించినట్లు తెలిసింది. ఈ విధంగా మహేష్, త్రివిక్రమ్ మళ్ళీ కలిశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














