భవిష్యత్తు ‘సందిగ్ధంలో’ త్రివిక్రమ్..!

టాలీవుడ్ టాప్ దర్శకుల్లో త్రివిక్రమ్ స్థానం వేరు. ఆయన దర్శకుడిగా చేసింది కొన్ని సినిమాలే అయినా….ఆ కొన్నింటితోనే ప్రభంజనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయ్యాడు. ఇదిలా ఉంటే అత్తారింటికి దారేదీ భారీ హిట్ తరువాత బన్నీతో జత కట్టిన త్రివిక్రమ్, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ అంటూ విలువలతో కూడిన సినిమాను తెరకెక్కించాడు. అయితే అది బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ అనడంతో పెద్ద హీరోలతో ప్రయోగాలు వద్దు అనుకున్నాడో ఏమో కానీ, మొత్తానికి ఫ్లాప్స్ తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన నితిన్ హీరోగా…’అ ఆ’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తమిళ నటుడు సూర్య తో ఒక సినిమా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా వినిపిస్తున్న వాదన ప్రకారం త్రివిక్రమ్ సూర్యను కాదు అని, మళ్లీ బన్నీతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మీడియా వార్తలు అన్నీ పక్కన పెట్టి అసలు త్రివిక్రమ్ మనసులో ఏముంది అంటే…అసలు తాను ఏ సినిమా కూడా ఇంకా అనుకోలేదని.. ఏదీ సైన్ చేయలేదని…అంతేకాకుండా ”అ..ఆ” సినిమా రిలీజయ్యి రిజల్టు బయటకొచ్చే వరకు ఏ హీరోతో ప్రాజెక్టు చేస్తానో కన్ఫామ్ గా చెప్పలేనని మన దర్శకుడు తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. మరి ఎప్పుడూ కొత్తదనాన్ని అందించే మన గురువుగారు, సరికొత్తగా సూర్యతో చేస్తారో…లేకపోతే మళ్లీ బన్నీనే నమ్ముకుంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags