DSP,Thaman: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లపై భారీ ట్రోల్స్!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు దేవిశ్రీప్రసాద్, తమన్ లపై భారీ ట్రోలింగ్ జరుగుతోంది. చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా నుంచి దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఒక పాటను, బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ సినిమా నుంచి తమన్ కంపోజ్ చేసిన ఒక పాటను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ వీడియోలతో అటు దేవిశ్రీ, ఇటు తమన్ తెగ హడావిడి చేశారు. ఆ పాటలు హిట్ అయ్యాయా..? లేదా..? అనే విషయాన్ని పక్కన పెడితే.. ట్రోలింగ్ మాత్రం ఓ రేంజ్ లో జరుగుతోంది.

‘బాస్ పార్టీ’ సాంగ్ ప్రోమో వచ్చినప్పుడు డీఎస్పీ ‘నువ్వు లుంగీ ఏస్కో.. క‌ర్చిఫ్ క‌ట్టుకో’ అంటూ తనదైన బీట్ లో సాంగ్ పాడారు. అప్పుడు మొదలైన ట్రోలింగ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక తమన్ తన కాపీ ట్యూన్స్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. పాత పాటలు, జానపద గీతాలు, ఇంగ్లీష్ సాంగ్స్ ఇలా తనకు ఎక్కడైనా మంచి మ్యూజిక్ అనిపిస్తే.. దాన్ని తనకు తగ్గట్లుగా మార్చి సాంగ్స్ చేస్తుంటారు. ఆయన ఒరిజినల్ మ్యూజిక్ ఇచ్చిన సందర్భాలు, హిట్ ఆల్బమ్స్ చాలానే ఉన్నాయి.

కానీ ఏదైనా సాంగ్ కాపీ ట్యూన్ అనిపిస్తే మాత్రం జనాలు ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు ‘జై బాలయ్య’ సాంగ్ ట్యూన్ ‘ఒసేయ్ రాములమ్మ’ సాంగ్ బీట్ తో కలుస్తుండడంతో ట్రోలింగ్ షురూ చేశారు. ఈ సాంగ్ కోసం తమన్ కవర్ సాంగ్ చేయడం మరిన్ని ట్రోల్స్ కి హెల్ప్ చేస్తోంది. తమన్ గెటప్ పై ఓ రేంజ్ లో మీమ్స్ వస్తున్నాయి.

సంక్రాంతికి రాబోతున్న చిరు, బాలయ్య సినిమాల్లో ఏది హిట్ అవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కానీ ఇంతలో వారి సినిమాలకు మ్యూజిక్ అందించిన సంగీత దర్శకులు ట్రోలింగ్స్ కి గురి కావడం వార్తల్లో నిలిచింది. ఇకనైనా.. ఈ సినిమాల నుంచి రిలీజ్ చేసే సాంగ్స్ శ్రోతలను ఆకట్టుకుంటాయేమో చూడాలి!

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus