టాలీవుడ్ యువ హీరోల్లో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన సొంత టాలెంట్ తో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా ఎదిగాడు న్యాచురల్ స్టార్ నాని….అయితే హీరోగా తన కరియర్ మొదలయిన తొలి నాళ్ళలో పరాజయాలు పలకరించినప్పటికీ ఎక్కడ వెనకడుగు వేయకుండా తన న్యాచురల్ యాక్టింగ్ ను కంటిన్యూ చేస్తూ వరుస హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు…..ఇక నాని తాజా 3-4సినిమాలు భారీ వసూళ్లను సాధించడమే కాకుండా ఓవెర్సీస్ లో కూడా నానికి మంచి పేరు తెచ్చిపెట్టాయి….ఒకరంగా చెప్పాలి అంటే నాని సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వరకూ అక్కడి ప్రేక్షకులను తీసుకొచ్చాయి అని చెప్పాలి….ఇదిలా ఉంటే అదే క్రమంలో నాని తాజా సినిమా “నేను లోకల్” విడుదలకు ముస్తాబు అవుతున్న తరుణంలో ట్రంప్ హెచ్1బీ విసాలపై తీసుకున్న కఠిన నిర్ణయం నానికి ఎదురు దెబ్బగా మారింది….
విషయంలోకి వెళితే….అమెరికా అద్యక్షుడు ట్రంప్ హెచ్-1 బి వీసాలపై ఆంక్షలు పెట్టడంతో పాటు కనీస వేతనానికి సంబంధించిన నిబంధనలు పెట్టిన పరిణామాల నేపధ్యంలో ప్రస్తుతం అమెరికాలోని ఎన్నారైలందరూ ఒక రకమైన ఆందోళనలో ఉన్నారు అని తెలుస్తుంది…భవిష్యత్ గురించి బెంగతోపాటు మున్ముందు ఎలాంటి పరిణామాలుంటాయో అన్న ఆందోళనతో కలవరపడుతున్నారు అక్కడి మన తెలుగు ప్రజలు అలాంటి సమయంలో సినిమాలు చూడాలి అన్న ఆలోచన కానీ…ఎంటర్‌టేన్‌మెంట్ గురించి ఆలోచించే అవకాశం కానీ చాలా తక్కువ అనే చెప్పాలి…ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా జరుగుతున్న నేపధ్యంలో ఈవీకెండ్ కు ఈ ఆందోళనలు మరింత పెరుగుతాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నాని సినిమా అక్కడ ఎలాంటి ఓపెనింగ్స్ రాబట్టుకుంటుందో అన్న ఆందోళనలో సినిమాను కొనుక్కున్న ఓవర్ సీస్ బయ్యర్లు భయపడుతున్నట్లు టాక్. చూద్దాం ఏం జరుగుతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.