“తుంటరి” పాటలు విడుదల

తుంటరిపాటలు విడుదల

నారారోహిత్, లతా హెగ్డే జంటగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం తుంటరి. . కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో అశోక్ బాబా,నాగార్జున్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ జయబేరి క్లబ్ లో శుక్రవారం జరిగింది.  ఈ సినిమా థియేట్రిటక్ ట్రైలర్ ను రేవంతి రెడ్డి విడుదల చేశారు. ఆడియో సీడీలను వి.వి.వినాయక్ విడుదల చేసి తొలిసీడీని రేవంత్ రెడ్డికి అందించారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూఅమెరికా సైనం ముప్పై లక్షలు అయితే ఇక్కడ టిడిపి సైన్యం ఆరవై లక్షలు. మనం సినిమాను రెండుసార్లు చూస్తే చాలు సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. దిల్ సినిమాతో రాజు దిల్ రాజు ఎలా అయ్యాడో. తుంటరి సినిమాతో తుంటరి రోహిత్ అవుతాడు. రోహిత్ ఎనిమిదో సినిమా. వంద సినిమాలు త్వరగా పూర్తి చేయాలి. దర్శక నిర్మాలకు యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘’దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ కథ అందించిన మాన్ కరాటే చిత్రానికి రీమేక్ ఇది. ట్రైలర్ బావుంది. నారా రోహిత్ లో కామెడి యాంగిల్ చూడబోతున్నాం.  దర్శకుడు కుమార్ నాగేంద్ర మంచి చిత్రాలను తీశాడు. ఈ సినిమా కూడా తనకు మంచిసక్సెస్ కావాలి.  పాటలు బావున్నాయి. సాయికార్తీక్ మ్యూజిక్ పెద్ద హిట్ కావాలి ‘’అన్నారు.

నారా రోహిత్ మాట్లాడుతూ ‘’తమిళ సినిమా మాన్ కరాటేకు ఇది రీమేక్. ఇలాంటి మంచి కథను తీసుకొచ్చి నాతో సినిమా చేసినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. సాయికార్తీక్ నేను చేసిన నాలుగో సినిమా ఇది. మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నేను డిపరెంట్ సినిమాలు చేసినా ఈ సినిమా నాకు కూడా డిఫరెంట్ మూవీయే. ఎందుకంటే ఇందులో కామెడి చేశాను. సినిమా అందరూ ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను‘’ అన్నారు.

సాయికార్తీక్ మాట్లాడుతూపక్కా కమర్షియల్ మూవీ.పెద్ద కమర్షియల్ హిట్ అవుతుంది. అన్నీ రకాలైన పాటలు కుదిరాయి. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్. రోహిత్ గారు ఇలాంటి సినిమా మొదటిసారి చేస్తున్నారు‘’ అన్నారు.

శ్రీవాస్ మాట్లాడుతూ ‘’గుండెల్లో గోదారి, జోరు వంటి డిఫరెంట్ సినిమాలను తీసిన దర్శకుడు కుమార్ నాగేంద్ర తీసిన సినిమా ఇది. ఆ రెండు సినిమాల కంటే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. నిర్మాతలకు అభినందనలు.

తారకరత్న మాట్లాడుతూ ‘’నారా రోహిత్ సైలెంట్ గా కనపడతాడు కానీ మంచి కామెడి టైమింగ్ ఉన్న నటుడు. మాస్, కామెడి సహా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. ఈ సినిమాను ప్రేక్షకులందరూ పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’అన్నారు.

ఈ కార్యక్రమంలో కబీర్ సింగ్, కోడెల శివరాం, వీరేందర్ గౌడ్, కరణం వెంకటేష్ సహా పలువురు అతిథులు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్ః సాయికార్తీక్‌,
ఎడిట‌ర్ః త‌మ్మిరాజు,ఆర్ట్ఃముర‌ళి కొండేటి   కెమెరాః ఎం.ఆర్‌.ప‌ళ‌ని కుమార్‌, ,స్టంట్స్ః వెంక‌ట్‌,కొరియోగ్ర‌ఫీః బాబా భాస్క‌ర్‌,నిర్మాత‌లుః అశోక్ బాబా,నాగార్జున్‌,ద‌ర్శ‌క‌త్వం: కుమార్ నాగేంద్ర‌.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus