Actress: నెల రోజుల బాబుకి బుల్లితెర నటి ఎంత బంగారం కొన్నారో తెలుసా!

  • April 1, 2023 / 08:59 PM IST

సెలబ్రిటీలు గర్భం దాల్చడం, బేబీ బంప్ పిక్స్, వీడియోస్, సీమంతం ఫంక్షన్ వంటి వాటికి సంబంధించిన వివరాలు నెట్టింట ఎంతలా వైరల్ అవుతుంటాయో తెలిసిందే.. ఈ విషయంలో టాలీవుడ్, బాలీవుడ్, సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ అనే తేడా ఉండదు.. కాస్త పాపులారిటీ ఉన్న వారెవరైనా మరింత ఫేమ్ అయిపోతుంటారు.. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన భార్య ఉపాసన బేబీ బంప్‌తో కనిపించారు.. మ్యారేజ్ అయిన 10 ఏళ్లకు పేరెంట్స్‌గా ప్రమోటయ్యారు..

బాలీవుడ్ స్టార్ కపుల్ ‘దృశ్యం’ ఫేమ్ ఇషితా దత్తా, వత్సల్ సేథ్‌ పెళ్లి జరిగిన 5 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు కాబోతున్నామంటూ తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు.. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ బుల్లి తెర నటి తన బాబుకి తొలిసారి బంగారం కొనుగోలు చేశారు.. షాప్ అంతా తిరుగుతూ ఏమేం కావాలో అన్నీ కొని.. ఆ వీడియో పోస్ట్ చేయగా సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.. సీరియల్ యాక్ట్రెస్ వైష్ణవి రామిరెడ్డి ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చారు..

రీసెంట్‌గా ‘పిల్లలకి ఏం ఏం వేస్తారో అవన్నీ చూపించండి’ అంటూ అన్నీ పక్కన పెట్టిస్తూ భారీ షాపింగ్ చేశారు.. బాబుకి దిష్టి తగలకుండా 4 గ్రాముల దిష్టి పూసల దండ (జత), 8 గ్రాముల కడెం (బేబీ బ్యాంగిల్స్ – జత), 1 గ్రాము ఉంగరం, ఒక చైన్, 14 గ్రాముల బ్రేస్‌‌లెట్ తీసుకున్నారు.. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ గోల్డ్ షాపింగ్ అన్నాక ఆడవారి చూపు నగల మీద పడకుండా ఉంటుందా చెప్పండి..

లేటెస్ట్ డిజైన్స్ ఏమొచ్చాయో అడుగుతూ వాటిని తనివితీరా చూసుకున్నారు(Actress).. పనిలో పనిగా తనకు లక్ష్మీదేవి నెక్లెస్, మ్యాచింగ్ గాజులు, చెవి కమ్మలు కూడా తీసుకున్నారు.. దీనంతటికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో షేర్ చేశారు.. ‘నెల రోజుల వయసున్న బాబుకి అన్ని బంగారు ఆభరణాలా?’ అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్లు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus