Mahesh Babu, Vijay: హీరోల ఫ్యాన్స్ మధ్య ఈ గొడవలు ఆగవా?

స్టార్ హీరో మహేష్ బాబుకు తెలుగులో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. తమిళంలో హీరో విజయ్ కు కూడా ఇదే స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా తమిళంలో విజయ్ బీస్ట్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. నెల రోజుల గ్యాప్ లో ఈ రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.

Click Here To Watch

మహేష్ బాబు, విజయ్ మధ్య మంచి స్నేహం ఉందనే సంగతి తెలిసిందే. మహేష్ హీరోగా తెరకెక్కి హిట్టైన పలు సినిమాలను తమిళంలో విజయ్ రీమేక్ చేసి ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ ఇద్దరు హీరోలలో ఒకరిని ఎక్కువ మరొకరిని తక్కువ చేయలేము. మహేష్ తర్వాత సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా విజయ్ నటించిన బీస్ట్ ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ ఇద్దరు హీరోల అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నెల 14వ తేదీన సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్, బీస్ట్ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో లైక్స్ ను పెంచడానికి విజయ్ ఫ్యాన్స్ బాట్స్ ను ఉపయోగిస్తారని కామెంట్ చేయగా విజయ్ అభిమానులు మహేష్ ఫ్యాన్స్ ఫౌల్ క్రై చేస్తున్నారని కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

హీరోల అభిమానులు హీరోల పరువు తీస్తున్నారని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మహేష్, విజయ్ సినిమాల నుంచి ఒకేరోజు ఫస్ట్ సింగిల్ రిలీజవుతుండటంతో అభిమానుల మధ్య సమస్య మొదలైంది. హీరోలు తమ అభిమానులకు ఇలాంటి గొడవల వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని సూచించాలని ఇతర హీరోల ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus