Dhanush: ధనుష్‌ రెండో సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌ ఓకే… ఇంకా ఉన్నారట!

  • August 3, 2023 / 01:43 PM IST

ధనుష్‌ కొత్త సినిమా ‘డీ50’ గురించి రోజుకో ఆసక్తికర విషయం బయటకు వస్తోంది. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ధనుష్‌ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమా రెగ్యులర్‌ కథకు భిన్నంగా ఉంటుంది అని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇందులో కథానాయికలు ఎక్కువమంది ఉంటారు అని చెబుతున్నారు. అందులో ఓ ఇద్దరిని తాజాగా ఓకే చేశారు. ఈ మేరకు సినిమా టీమ్‌ అధికారికంగా చెప్పింది.

అనికా సురేంద్రన్‌, దుషారా విజయన్‌ను ‘డీ50’లోకి తీసుకున్నట్లు సినిమా టీమ్‌ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసింది. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అనిక ఓ కీలక పాత్ర పోషిస్తుందటట. ఇక చెల్లెలిగా దుషారా విజయన్‌ కనిపిస్తుందట. దర్శకుడిగా ధనుష్‌కి ఇది రెండో సినిమా కాగా… తొలి సినిమా ‘పవర్‌ పాండీ’. ఆ సినిమాతోనే వైవిధ్యమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ధనుష్‌ మరి ఈ సినిమాతో ఏం చేస్తాడో చూడాలి.

గుండుతో మెడలో రుద్రాక్షమాల వేసుకొని ఉన్న పోస్టర్‌ ‘డీ50’ టీమ్‌ రిలీజ్‌ చేసింది. దీంతో ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఈ సినిమా మారింది. ఈ సినిమా మొత్తం చెన్నై నేపథ్యంలోనే ఉంటుందట. అన్నదమ్ముల మధ్య వైరం ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందిస్తారు అనే మాట కూడా వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

ధనుష్‌ (Dhanush) ప్రస్తుతం అరుణ్‌ మథేశ్వరన్‌ దర్శకత్వంలో ‘కెప్టెన్‌ మిల్లర్‌’ అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌ జోనర్‌లో రానున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా డిసెంబరు ద్వితీయార్ధంలో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కాకుండా ‘తేరా ఇష్క్‌ మే’ అనే ఓ బాలీవుడ్‌ సినిమాలోనూ ధనుష్‌ నటిస్తున్నాడు. ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో సినిమాలతో మెప్పించిన ధనుష్‌ ఈ సినిమాతో ఇంకెంత వావ్‌ అనిపిస్తాడో చూడాలి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus