Bigg Boss Show: డబుల్‌ ‘మసాలా’ కోసం బిగ్‌బాస్‌ టీమ్‌ ప్లానింగ్‌

ఐదో సీజన్‌ గురించి ‘బిగ్‌బాస్‌’ టీమ్‌ భారీ ప్రయత్నాలే వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలుత ఈ వార్తల్ని నమ్మడం కష్టంగా అనిపించినా… ఇప్పుడు అవే నిజాలు అని కూడా అంటున్నారు. గత నాలుగు సీజన్లకు మించి వినోదం, వైవిధ్యం, భారీతనం ఉండేలా ఈ సారి బిగ్‌బాస్‌, మాటీవీ ప్రయత్నాలు చేస్తున్నాయని టాక్‌. అందులో భాగంగానే ఈ సారి ఇద్దరు హోస్ట్‌లను తెర మీదకు తీసుకొస్తారని తెలుస్తోంది. బిగ్‌బాస్‌ షోని… అది ఏ లాంగ్వేజ్‌లో అయినా ఒకరు మాత్రమే హోస్ట్‌గా ఉంటారు.

ప్రతి వీకెండ్‌లో అంటే శని, ఆదివారాల్లో వచ్చి వాళ్లతో ఆడించి, పాడించి, ఏడిపించి, విసిగించి, ఒక్కోసారి చిరాకు తెప్పించి వినోదం పండిస్తుంటారు. సాధరణ రోజుల్లో అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు హోస్ట్‌ లేకుండానే షో జరిగిపోతుంటుంది. అంటే 9.30 అవ్వగానే షో మొదలై… హౌస్‌ మేట్స్‌ చేసేవన్నీ చూపించి 11కి క్లోజ్‌ చేసేస్తుంటారు. అయితే ఈసారి అలా ఉండదట. సాధారణ రోజుల్లో కూడా ఈసారి హోస్ట్‌ ఉండబోతున్నారని టాక్‌. అది కూడా అలీ అని సమాచారం.

వీకెండ్‌లాగే రోజూ వచ్చి… కొన్ని సెగ్మంట్స్‌ వారీగా వివరిస్తూ షోను రన్‌ చేయాలని చూస్తోందట బిగ్‌బాస్‌ టీమ్‌. మరి ఇది ఎంతవరకు ఓకే అవుతుంది అనేది తెలియదు కానీ… ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంది. వీకెండ్‌తో అయితే ఇద్దరు హోస్ట్‌లు ఉండి… ఈ వారం మొత్తం ఏం జరిగిందో… రివ్యూ వేస్తారట. ఇంట్రెస్టింగ్‌ కదా… చూద్దాం ఎలా ఉంటుందో ఈ ‘డబుల్‌’ మసాలా! డబుల్‌ అని ఒత్తి చెబుతున్నాం ఏంటీ అనుకుంటున్నారా… అక్కడ వచ్చే డబుల్‌ హోస్ట్‌ తెలుసు కదా… అలీ! ఆ మాత్రం డైలాగ్‌లు పడతాయి లెండి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus