నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన లవ్ స్టోరీ మూవీ రేపు రిలీజ్ కానుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన సినిమాలలో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే లవ్ స్టోరీ మూవీకి ఏపీలో సెకండ్ షోకు అనుమతి లేకపోవడం, 100 శాతం ఆక్యుపెన్సీ లేకపోవడం సమస్యగా మారింది. ఏపీ ఆరోగ్య శాఖ నుంచి నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు రాలేదని సమాచారం.
సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటే 100 శాతం ఆక్యుపెన్సీ ఉంటుందని జగన్ ఆంగీకరించని పక్షంలో ఉండదని సమాచారం. విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. మూడు రోజుల క్రితం జరిగిన సమావేశంలో మంత్రి పేర్ని నాని ఈ రెండు విషయాలకు సంబంధించి సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది. అయితే పేర్ని నాని ప్రస్తుతం జిల్లా పరిషత్ ఎన్నికల హడావిడితో బిజీగా ఉన్నారు. మరోవైపు లవ్ స్టోరీ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రమే ఫ్యామిలీలు ఈ సినిమాకు క్యూ కట్టే అవకాశం ఉంటుంది.
లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. సాయిపల్లవి సైతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. చైతన్య లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల్ని ఫిదా చేస్తారో లేదో చూడాల్సి ఉంది. 20 కోట్ల టార్గెట్ తో రిలీజవుతున్న ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.