Akhanda Movie: అఖండ రీమేక్ రైట్స్ కోసం పోటీగా ఇద్దరు స్టార్స్?

  • January 24, 2022 / 05:01 PM IST

సెకండ్ వేవ్ అనంతరం భారీ స్థాయిలో లాభాలను అందించిన సినిమాల లిస్టులో అఖండ కూడా చోటు దక్కించుకుంది. నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ఈ మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. హిందు దేవాలయాల ప్రాముఖ్యత, అఘోరా పాత్ర, యాక్షన్ సన్నివేశాలు, దానికి తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్ని సమపాళ్లలో ఉంటే సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో మరోసారి ఋజువయ్యింది.

ఇక సినిమాకు సంబంధించిన రీమేక్స్ పై గత కొన్ని రోజులుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాను రీమేక్ చేసేందుకు కొందరు దర్శక నిర్మాతలతో పాటు ఇద్దరు స్టార్ హీరోలు కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం. నార్త్ ఇండస్ట్రీలో ఎక్కువ శాతం హిందు దేవుళ్ళ పై సెటైర్ వేసే విధంగా సినిమాలు తీయడమే గాని దేవాలయాల గొప్పతనం, వాటి వెనకున్న చరిత్ర పై పెద్దగా సినిమాలు వచ్చింది లేదు.

ఇక పర్ఫెప్ట్ గా అఖండ లాంటి సినిమా వస్తే నార్త్ జనాలు ఎగబడి చూస్తారని చెప్పవచ్చు. ఇక అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు అఖండ రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ ఇప్పటికే రామసేతు బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అజయ్ దేవగన్ లాంటి హీరో కూడా గతంలో అలాంటి సినిమాలు చేశాడు. టాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో ఈ ఇద్దరు స్టార్స్ గతంలో మంచి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నారు.

ఇక అఖండ లాంటి సినిమాను నార్త్ జనాల వాతావరణానికి తగ్గట్టుగా తెరపైకి తీసుకు వస్తే ఎగబడి చూస్తారని చెప్పవచ్చు. అయితే సినిమాను డైరెక్ట్ చేసే విధానం కూడా చాలా అవసరం. మరి రీమేక్ కు ఈ ఇద్దరిలో ఎవరు ఒప్పుకుంటారో? ఏ దర్శకుడు డైరెక్ట్ చేస్తాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus