పాతిక కోట్ల దిశగా యూ టర్న్

క్యూట్ బ్యూటీ సమంత ఇదివరకు ఎన్నో హిట్స్ అందుకున్నారు. ఆమె నటించిన సినిమాలు వందకోట్ల క్లబ్ లో చేరాయి. రంగస్థలం అయితే 200 కోట్ల మెయిలు రాయిని దాటాయి. వాటిన్నటికంటే ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నారు. అందుకు కారణం “యు టర్న్”. ఆమె చేసిన తొలి లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఇది. కన్నడలో హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రీమేక్ చేశారు. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత జర్నలిస్ట్ రోల్ పోషించింది. భూమిక, అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీ వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న థియేటర్లోకి వచ్చింది. తొలి రోజు నుంచి మంచి స్పందన అందుకుంది. తొలి రోజే కోటీ వసూలు చేసిన ఈ చిత్రం మౌత్ టాక్ తో ఊహించినదానికంటే ఎక్కువ వసూళ్లులను రాబట్టింది.

రెండు వారాలు కూడా పూర్తికాకముందే పాతికకోట్ల మైలురాయి చేరుకోవడానికి పరుగులు పెడుతోంది. 12 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. నిన్న, ఈరోజు కలక్షన్స్ కలుపుకుంటే దాదాపు పాతికకోట్ల అవుతుందని ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు. రేపు అక్కినేని నాగార్జున, నాని నటించిన దేవదాస్ మూవీ వస్తోంది. సో యూ టర్న్ కి థియేటర్లు తగ్గిపోవచ్చు. అయినా పాతికకోట్ల గ్రాస్ ని సమంత సినిమా క్రాస్ చేస్తుందని నమ్మకంతో ఉన్నారు. ఇక భర్త నాగ చైతన్యతో కలిసి విదేశాల్లో విహరిస్తున్న సమంత ఈ విజయాన్ని ఆస్వాదిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus